18 ఏళ్ల మిస్టరీ బౌలర్ అల్లా కోసం రూ. కోట్లు పోసిన ముంబై ఇండియన్స్
Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ రెండో రోజు మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
ఐపీఎల్ హాట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లల్లో ఒకటిగా ఉంటూ వస్తోన్న ముంబై ఇండియన్స్.. రెండో రోజు ఇంట్రెస్టింగ్ యంగ్ ప్లేయర్లను తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అల్లా మహ్మద్ ఘజన్ఫర్ భారీ రేటు పలికాడు. 18 సంవత్సాల ఈ యంగ్ క్రికెటర్‌ను 4.80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

ఈ రైట్ ఆర్మ ఆఫ్ బ్రేక్ బౌలర్.. 2024 సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌లో కొనసాగాడు గానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్‌లో ఇంతవరకు బోణీ కూడా కొట్టలేదు. అతని కోసం కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. రేటు అమాంతంగా 4.80 కోట్ల రూపాయలకు చేరింది. ఈ రేటు వద్ద ముంబై ఇండియన్స్ అతన్ని దక్కించుకుంది.
ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టు తరఫున ఇప్పటివరకు 10 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు ముజన్ఫర్. 12 వికెట్లు పడగొట్టాడు. 6/26 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. బంగ్లాదేశ్‌పై ఈ ఘనత సాధించాడు. బ్యాటర్లకు కొరుకుడుపడని విధంగా బంతులను సంధించడంలో దిట్ట. వన్డే ఇంటర్నేషనల్స్‌లో అతని బౌలింగ్ ఎకానమీ 4.36గా ఉండటం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇంకా అడుగు కూడా పెట్టలేదు. ఈ ఫార్మట్‌లో 16 దేశవాళీ మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. ఈ ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో పెట్టుకుని ముంబై ఇండియన్స్.. అల్లా మహ్మద్ ముజన్ఫర్ కోసం పోటీ పడింది. అనూహ్యంగా 4.80 కోట్ల రూపాయలను పెట్టడానికీ వెనుకాడలేదు. ప్రస్తుతానికి కర్ణ్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్‌లో ఉన్న రెండో స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ అతనొక్కడే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications