కేన్ మామకు బిగ్ షాక్..!!
Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ రెండో రోజు మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
న్యూజిలాండ్ మాజీ కేప్టెన్, అన్ని ఫార్మట్లల్లో ఫిట్ అనిపించుకోగల కెపాసిటీ ఉన్న కేన్ విలియమ్సన్ అమ్ముడు పోలేదు. రెండో రోజు తొలి రౌండ్‌లో అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. సుదీర్ఘకాలం అతన్ని అట్టి పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సహా ఏ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆసక్తి చూపలేదు.

ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న అనుభవం ఉంది కేన్ విలియమ్సన్‌కు. 2015లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. 2024 వరకూ కొనసాగాడు. మొత్తంగా 79 మ్యాచ్‌లల్లో 2,128 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 64. 125.62 స్ట్రైక్‌రేట్‌ను నమోదు చేశాడు. బ్యాటింగ్ సగటు 35.47.
ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ కేన్ విలియమ్సన్‌పై బెట్ వేయడానికి ఏ ఫ్రాంఛైసీ ముందుకు రాలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడాడు. గాయం వల్ల సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.
కేన్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లల్లో సత్తా చాటుతున్న పలువురు ప్లేయర్లు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు తొలి రౌండ్‌లో. అజింక్య రహానె, న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్, దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్‌ను ఎవరూ తీసుకోలేదు. బిడ్డింగ్స్ వేయలేదు. మలి దఫాలో వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications