Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ మోస్ట్ సీనియర్‌ను చీప్ రేట్‌కు కొట్టేసిన కావ్య

Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్‌ రెండో రోజు మెగా ఆక్షన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.

ఈ సీజన్ కోసం మరో బౌలర్‌ను జట్టులోకి తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. 105 మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న జయదేవ్ ఉనద్కత్‌ను కొనుగోలు చేసింది. కోటి రూపాయల ప్రైస్‌తో అతన్ని కొట్టేసింది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్ జయదేవ్. 2010 నుంచీ ఇప్పటివరకూ ఎక్కడే గానీ గ్యాప్ ఇవ్వలేదు.

IPL auction 2025 Jaydev Unadkat will play for SRH for 1 Cr

ఐపీఎల్‌లో రెండుసార్లు అయిదు వికెట్లను పడగొట్టిన అతి తక్కువ మంది ప్లేయర్లల్లో ఉనద్కత్ ఒక్కడు. మూడు వికెట్లను అయిదుసార్లు తీసుకున్నాడు. బౌలింగ్ ఎకానమీ కాస్త అధికంగా ఉన్నప్పటికీ- నిలకడగా రాణిస్తోండటం ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రత్యేకత. ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్ల తరఫునా ఆడింది అతనొక్కడే. 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పుడతన్ని మళ్లీ తీసుకుంది ఫ్రాంఛైజీ.

ఇదివరకు కోల్‌కత నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లకు ఆడాడు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కంటిన్యూ అవుతున్నాడు.

ఆయా ఫ్రాంఛైజీల తరఫున ఇప్పటివరకు 105 మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉంది జయదేవ్ ఉనద్కత్‌కు. 99 వికెట్లు తీసుకున్నాడు. వంద వికెట్ల క్లబ్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. 5/25 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. బౌలింగ్ ఎకానమీ 8.98గా రికార్డయింది. ఏ బౌలర్ కూడా కోరుకోని అంకెలివి.

Story first published: Monday, November 25, 2024, 19:21 [IST]
Other articles published on Nov 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+