Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

19 ఏళ్ల ఆఫ్ఘన్ ప్లేయర్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్..!!

Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్‌ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

IPL Auction 2025 CSK buy Afghan cricketer Noor Ahmed for Rs 10 Cr

ఈ వేలం పాటలో చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్.. అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. 19 సంవత్సరాల ఈ యంగెస్ట్ క్రికెటర్‌ ఇప్పటివరకు ఆడింది రెండు ఐపీఎల్ సీజన్లే. ఆడింది 23 మ్యాచ్‌లే. అయినప్పటికీ అతని కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది సీఎస్‌కే.

ఆ ప్లేయర్- నూర్ అహ్మద్. స్వదేశం.. ఆఫ్ఘనిస్తాన్. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్. చైనామన్ బౌలర్‌గా గుర్తింపు ఉందతనికి. అతని యాక్షన్ కుల్‌దీప్ యాదవ్‌ను పోలివుంటుంది. 2023లో ఐపీఎల్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో అసోసియేట్ అయ్యాడు. మొన్నటివరకు ఆ జట్టుతోనే ఉన్నాడు. మెగా ఆక్షన్ కోసం అతన్ని రిలీజ్ చేసిందీ ఫ్రాంఛైజీ.

ఇప్పుడతన్ని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆడింది రెండు సీజన్లే అయినప్పటికీ అదరగొట్టాడు నూర్ అహ్మద్. 2023లో 16, 2024లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 23 మ్యాచ్‌లల్లో 24 వికెట్లు తీసుకున్నాడు. 3/37 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.

గ్రౌండ్‌లో పాదరసంలా కదలగలడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన మ్యాచ్‌లల్లో అతను పట్టిన క్యాచ్‌లే దీనికి ఎగ్జాంపుల్. 14 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన నూర్ అహ్మద్ ఏడు వికెట్లు పడగొట్టాడు. 10 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. 10 మ్యాచ్‌లల్లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Sunday, November 24, 2024, 21:35 [IST]
Other articles published on Nov 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+