Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్య పాప డెసిషన్ రాంగ్ కాదని నిరూపించిన కొత్త బ్యాటర్: పరుగుల వరద..!!

Abhinav Manohar: అభినవ్ మనోహర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి దూసుకొచ్చిన కొత్త ప్లేయర్. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్ సందర్భంగా తొలి రోజే ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా మారన్ కంట్లో పడ్డ కన్నడిగుడు. భారీ రేటుకు అమ్ముడుపోయాడు. 3.20 కోట్ల రూపాయలకు అతన్ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్.

2022లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన అభినవ్ మొన్నటివరకు గుజరాత్ టైటాన్స్‌లో కొనసాగాడు. ఇప్పటివరకు ఆడిన 19 మ్యాచ్‌లల్లో 231 పరుగులు చేశాడు. 132.76 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 43. ఈ సారి వేలంపాట కోసం అభినవ్ మనో‌హర్‌ను గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసింది. దీనితో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.

IPL auction 2025 Abhinav Manohar smashed an unbeaten 59 off 24 after he acquired by SRH

ఐపీఎల్ వేలంపాట కొనసాగుతున్న సమయంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న మహారాజ ట్రోఫీ 2024లో చెలరేగాడు. ఈ టోర్నమెంట్‌లో శివమొగ్గ లయన్స్‌ తరఫున ఆడుతున్నాడు అభినవ్. ఈ ట్రోఫీలో భాగంగా చిన్నస్టామి స్టేడియంలో బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు.

లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అభినవ్.. 24 బంతుల్లోనే 59 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఒక ఫోర్, ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా మోహిత్ బీఏ, రోహన్ నవీన్ ధాటిగా ఆడటంతో శివమొగ్గ లయన్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్లాస్టర్స్.. ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది. కేప్టెన్ మయాంక్ అగర్వాల్ 17 బంతుల్లో 33, శుభాంగ్ హెగ్డె- 41 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 85, వికెట్ కీపర్ బ్యాటర్ సూరజ్ అహూజా- 38 బంతుల్లో 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 82 పరుగులు చేయడంతో బెంగళూరు బ్లాస్టర్స్ ఇంకా ఓ ఓవర్ మిగిలివుండగానే విజయం సాధించింది.

Story first published: Monday, November 25, 2024, 15:31 [IST]
Other articles published on Nov 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+