Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2023 వేలం పాట డీటెయిల్స్ వచ్చేశాయ్: తేదీ, వెన్యూపై బీసీసీఐ ప్రకటన..!!

IPL Auction 2023 Venue and date were announced, details inside

ముంబై: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ చివరిదశకు వచ్చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రస్తుతం తొలి సెమీ ఫైనల్ నడుస్తోంది. పాకిస్తాన్- న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇక గురువారం రెండో సెమీ ఫైనల్‌లో భారత్‌ను ఢీ కొట్టబోతోంది టైటిల్ హాట్ ఫేవరెట్.. ఇంగ్లాండ్. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది.

తేదీ-వేదిక ఇదే..

తేదీ-వేదిక ఇదే..

ఈ పరిణామాల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తాజా అప్‌డేట్ బయటికొచ్చింది. వచ్చే సంవత్సరం నిర్వహించబోయే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన తాజా సమాచారం ఇది. ఈ సీజన్ కోసం బీసీసీఐ- వేలంపాట వేదికను నిర్ధారించింది. తేదీని కూడా ఫిక్స్ చేసింది. కొద్దిసేపటి కిందటే ఈ సమాచారాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.. అనధికారికంగా. ఈ వేదికపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

టర్కీని వద్దనుకున్న బీసీసీఐ..

టర్కీని వద్దనుకున్న బీసీసీఐ..

ఇదివరకు వార్తలొచ్చినట్లుగా ఈ వేలంపాటను నిర్వహించడానికి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ దాకా వెళ్లట్లేదు బీసీసీఐ. స్వదేశంలోనే దీన్ని నిర్వహించనుంది. ఈ సీజన్ కోసం మెగా వేలంపాటను సిలికాన్ సిటీ బెంగళూరులో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి ఇస్తాంబుల్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు, కేరళలోని కోచి సిటీని కూడా షార్ట్ లిస్ట్ చేసింది. ఈ సీజన్ వేలంపాట కోసం తాజాగా కోచి నగరాన్ని ఎంపిక చేసింది.

కోచి సెలెక్ట్..

కోచి సెలెక్ట్..

ఇస్తాంబుల్‌కు వెళ్లడం కుదరకపోతే రెండో ఆప్షన్‌గా బెంగళూరులోనే ఈ వేలంపాటను నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ మొదట్లో వార్తలొచ్చాయి. దీనికి భిన్నంగా కోచిని సెలెక్ట్ చేసింది బీసీసీఐ. డిసెంబర్ 23వ తేదీన కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలంపాటను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతోన్న 10 ఫ్రాంఛైజీల వద్ద 90 నుంచి 95 కోట్ల రూపాయల బ్యాలెన్స్ మిగిలివుంది. ఈ మొత్తంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పర్స్ అమౌంట్ ఇదే..

పర్స్ అమౌంట్ ఇదే..

ఫ్రాంఛైజీలవారీగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్- రూ.3.45 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్- రూ.2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ.1.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్- రూ.95 లక్షలు, గుజరాత్ టైటాన్స్ - రూ. 15 లక్షలు, ముంబై ఇండియన్స్- రూ.10 లక్షలు, సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 10 లక్షలు, ఢిల్లీ కేపిటల్స్ - రూ. 10 లక్షల రూపాయల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఒక్క లక్నో సూపర్ జెయింట్స్ పర్స్‌లో మాత్రమే జీరో బ్యాలెన్స్ ఉంది.

రిలీజ్ చేయదలిచింది..

రిలీజ్ చేయదలిచింది..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొందరు ప్లేయర్లను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. అంచనాలకు అనుగుణంగా రాణించని ప్లేయర్లను వదిలించుకోవడానికి సిద్ధపడింది. ఉద్వాసనకు గురయ్యే ప్లేయర్ల జాబితా పెద్దదే. విదేశీ, స్వదేశీ క్రికెటర్లు ఇందులో ఉన్నారు. రొమారియో షెప్పర్డ్, జగదీశ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయాస్ గోపాల్‌ను మినీ వేలం పాట కోసం విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

కసరత్తు పూర్తి..

కసరత్తు పూర్తి..

అదే సమయంలో కేప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, ప్రియం గర్గ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, నికొలస్ పూరన్, అభిషేక్ శర్మ, మార్కో జెన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌ను అట్టిపెట్టుకోనుంది. ఈ నెల 15వ తేదీలోగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ రిటెన్షన్, రిలీజ్ చేయదలిచిన ప్లేయర్ల తుది జాబితాను అందించాల్సి ఉన్న నేపథ్యంలో- అన్ని జట్లు కూడా దిశగా కసరత్తు దాదాపుగా పూర్తి చేశాయి.

Story first published: Wednesday, November 9, 2022, 16:06 [IST]
Other articles published on Nov 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+