For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Auction 2023:మెగా మినీ వేలంపాటకు సర్వం సిద్ధం.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎవరు..?

కొచ్చి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023 సీజన్ మినీ వేలం పాటకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కొచ్చి వేదికగా జరుగుతున్న ఈ మెగా మినీ ఈవెంట్‌లో మొత్తం 400కు పైగా ఆటగాళ్లను వేలం వేయనుంది. డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఈ సారి ఆటగాళ్ల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు అఫ్ఘానిస్తాన్‌కు చెందిన అల్లా మొహ్మద్ ఘజ్నాఫర్. ఇతని వయస్సు 15 ఏళ్లు మాత్రమే. ఈ కుర్రాడు మంచి ధరకు అమ్ముడుపోయే అవకాశాలున్నాయంటూ పలువురు దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు.

ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం అన్ని ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. అయితే ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను ఆయా జట్లు రిలీజ్ చేశాయి. ఇదిలా ఉంటే భారత్‌ నుంచి ఓ ఆరుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ పై ఆయా ఫ్రాంఛైజీలు దృష్టి సారించాయి. శివమ్ మావి, జగదీశన్,ముకేష్ కుమార్,యష్ ఠాకూర్,సన్వీర్ సింగ్,ఆకాష్ వశిష్ట్‌లపై ఫ్రాంఛైజీలు ఫోకస్ చేశాయి.ఇక ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలికాడు అనే పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Dec 23, 2022, 9:45 pm IST

ముగిసిన ఐపీఎల్ 2023 మినీ వేలం

ముగిసిన ఐపీఎల్ 2023 మినీ వేలం.. చివరి ప్లేయర్‌గా ఎకాంత్ సేన్.. ఆసక్తి కనబర్చని ఫ్రాంచైజీలు..

Dec 23, 2022, 9:12 pm IST

రూ.కోటి 50 లక్షలకు షకీబ్ అల్ హసన్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్

Dec 23, 2022, 9:12 pm IST

జోరూట్‌ను రూ.కోటికి కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Dec 23, 2022, 9:11 pm IST

నవీన్ ఉల్‌ హక్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Dec 23, 2022, 9:09 pm IST

మన్‌దీప్ సింగ్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్

Dec 23, 2022, 9:08 pm IST

మురుగన్ అశ్విన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Dec 23, 2022, 9:07 pm IST

కేఎమ్ ఆసిఫ్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Dec 23, 2022, 9:06 pm IST

అన్మోల్ ప్రీత్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 23, 2022, 9:06 pm IST

అకీల్ హోస్సెన్‌ను రూ. కోటికి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 23, 2022, 9:05 pm IST

సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసౌను రూ.4.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Dec 23, 2022, 9:04 pm IST

లిటన్ దాస్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్

Dec 23, 2022, 9:03 pm IST

ఆడమ్ జంపాను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Dec 23, 2022, 8:29 pm IST

ఆల్‌రౌండర్ శివమ్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్

Dec 23, 2022, 8:14 pm IST

ఆల్‌రౌండర్ భగత్ వర్మను రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

Dec 23, 2022, 8:13 pm IST

మోహిత్ రథీని రూ.20 లక్షలకు తీసుకున్న పంజాబ్

Dec 23, 2022, 8:03 pm IST

ఆల్‌రౌండర్ నెహాల్ వాదేర‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Dec 23, 2022, 8:02 pm IST

అమ్ముడుపోని భారత వెటరన్ పేసర్ వరుణ్ అరుణ్

Dec 23, 2022, 8:01 pm IST

అమ్ముడుపోని సామ్ కరన్ సోదరుడు టామ్ కరన్

Dec 23, 2022, 8:00 pm IST

అవినాశ్ సింగ్‌ను రూ.60 కోట్లకు తీసుకున్న ఆర్‌సీబీ

Dec 23, 2022, 7:59 pm IST

వికెట్ కీపర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 23, 2022, 7:59 pm IST

నమీబియాకు చెందిన డేవిడ్ వైస్‌ను రూ. కోటికి తీసుకున్న కేకేఆర్

Dec 23, 2022, 7:58 pm IST

ఆల్‌రౌండర్ షామ్స్ ములానీని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Dec 23, 2022, 7:57 pm IST

ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Dec 23, 2022, 7:56 pm IST

జోషువా లిటిల్‌ను రూ.4.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Dec 23, 2022, 7:55 pm IST

సుయాశ్ శర్మ‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్

Dec 23, 2022, 7:54 pm IST

పేస్ బౌలర్ రజన్ కుమార్‌ను రూ.70 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Dec 23, 2022, 7:53 pm IST

ఫాస్ట్ బౌలర్ విద్వాత్ కావెరప్ప‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Dec 23, 2022, 7:53 pm IST

వికెట్ కీపర్ విష్ణు వినోద్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Dec 23, 2022, 7:51 pm IST

వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Dec 23, 2022, 7:51 pm IST

డొనోవన్ ఫెర్రైరా‌ను రూ.50 లక్షలకు తీసుకున్న రాజస్థాన్ రాయల్స్

Dec 23, 2022, 7:50 pm IST

ప్రేరక్ మన్కడ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Dec 23, 2022, 7:49 pm IST

డాన్ జాన్సెన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Dec 23, 2022, 7:48 pm IST

రూ.1.8 కోట్ల భారీ ధరకు మయాంక్ దగర్‌ను తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 23, 2022, 7:05 pm IST

రూ. 40 లక్షలకు హర్‌ప్రీత్ భాటియాను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Dec 23, 2022, 7:04 pm IST

రూ.50 లక్షలకు అమిత్ మిశ్రాను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Dec 23, 2022, 6:23 pm IST

కైల్ జెమీసన్‌ను అతని కనీస ధర రూ. కోటీకి తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Dec 23, 2022, 6:22 pm IST

అమ్ముడు పోని రాసీ వాన్ డెర్ డస్సెన్, షెఫ్రానే రుథర్‌ఫోర్డ్, ట్రావిస్ హెడ్, మన్‌దీప్ సింగ్, డేవిడ్ మలాన్, డారిల్ మిచెల్, మహమ్మద్ నబీ, జిమ్మీ నీషమ్, డసన్ షనక, రిలే మెరిడిత్, టస్కిన్ అహ్మద్, సందీప్ శర్మ

Dec 23, 2022, 6:20 pm IST

డానియల్ సామ్స్‌ను రూ.75 లక్షలకు తీసుకున్న ముంబై ఇండియన్స్

Dec 23, 2022, 6:19 pm IST

రొమారియో షెఫర్డ్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Dec 23, 2022, 6:17 pm IST

విల్ జాక్స్‌ను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Dec 23, 2022, 5:51 pm IST

మనీష్ పాండేను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

రూ.2.40 కోట్లకు మనీశ్ పాండేను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Dec 23, 2022, 5:27 pm IST

రూ.20 లక్షల కనీస ధరకు హిమాన్షు శర్మను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Dec 23, 2022, 5:24 pm IST

ముకేశ్ కుమార్‌కు జాక్‌పాట్..

రూ.5.5 కోట్ల భారీ ధరకు ముకేశ్ కుమార్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న ముఖేశ్ కోసం పోటీపడ్డ ఫ్రాంచైజీలు

Dec 23, 2022, 5:18 pm IST

రూ.6 కోట్ల భారీ ధరకు శివమ్ మావిని కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Dec 23, 2022, 5:13 pm IST

రూ.45 లక్షలకు యశ్ ఠాకూర్‌ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Dec 23, 2022, 5:12 pm IST

రూ.60 లక్షలకు వైభవ్ అరోరాను కొనుగోలు చేసిన కేకేఆర్

Dec 23, 2022, 5:11 pm IST

రూ.25 లక్షలకు ఉపెందర యాదవ్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్

Dec 23, 2022, 5:10 pm IST

తెలుగు తేజం శ్రీకర్ భరత్‌ను కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

రూ.1.20 కోట్ల భారీ ధరకు శ్రీకర్ భరత్‌ను తీసుకున్న గుజరాత్ టైటాన్స్

Dec 23, 2022, 5:09 pm IST

నిశాంత్ సింధును రూ.60 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై

Dec 23, 2022, 5:08 pm IST

సమర్థ్ వ్యాస్‌ను రూ.20 లక్షలకు తీసుకున్న సన్‌రైజర్స్

Dec 23, 2022, 5:07 pm IST

రూ.2.60 కోట్ల భారీ ధరకు వివ్రాంత్ శర్మను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్

Dec 23, 2022, 5:06 pm IST

షేక్ రషీద్‌ను కొనుగోలు చేసిన సీఎస్‌కే

కనీస ధర రూ.20 లక్షలకు షేక్ రషీద్‌ను తీసుకున్న చెన్నై

Dec 23, 2022, 5:06 pm IST

అమ్ముడుపోని చేతన్, శుభమ్ ఖజురై, రోహన్ కున్నుమల్, హిమ్మత్ సింగ్, ప్రియమ్ గార్గ్, సౌరభ్ కుమార్

Dec 23, 2022, 5:06 pm IST

అమ్ముడు పోని అన్‌మోల్ ప్రీత్ సింగ్

Dec 23, 2022, 4:34 pm IST

అమ్ముడుపోని ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబర్చని ఫ్రాంచైజీలు

Dec 23, 2022, 4:31 pm IST

మయాంక్ మార్కాండేను కొనుగోలు చేసిన హైదరాబాద్

మయాంక్ మార్కాండేను రూ.50 లక్షల బేస్ ధరతో దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 23, 2022, 4:30 pm IST

ఆదిల్ రషీద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్

ఆదిల్ రషీద్‌ను రూ.2 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 23, 2022, 4:30 pm IST

ఇషాంత్ శర్మను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

బేస్ ధర రూ. 50 లక్షలకు అమ్ముడుపోయిన ఇషాంత్ శర్మ

Dec 23, 2022, 4:26 pm IST

దేశవాళీల్లో రాణించి టీమిండియాలో పునరాగమనం చేసిన జయదేవ్ ఉనద్కత్‌ను లక్నో జట్టు బేస్ ధర రూ.50 లక్షలకే కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 4:25 pm IST

ఇంగ్లండ్ ఎడం చేతి వాటం పేసర్ రీస్ టాప్లేను రూ.1.9 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొన్నది.

Dec 23, 2022, 4:24 pm IST

ఇంగ్లండ్ ఏస్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను బేస్ ధర రూ.2 కోట్లకు ఎవరూ కొనలేదు.

Dec 23, 2022, 4:20 pm IST

మరో ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 4:19 pm IST

టామ్ బాంటన్ కూడా అమ్ముడుపోలేదు. ఈ ఇంగ్లండ్ క్రికెటర్‌పై ఎవరూ ఆసక్తి చూపలేదు.

Dec 23, 2022, 4:17 pm IST

శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్‌పై ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో అతను అమ్ముడుపోలేదు.

Dec 23, 2022, 4:16 pm IST

సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రీ క్లాసెన్ కోసం సన్‌రైజర్స్, ఢిల్లీ గట్టిగా పోటీ పడ్డాయి. చివరకు అతన్ని రూ.5.25 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 4:15 pm IST

విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కోసం ఢిల్లీ, రాజస్థాన్ తలపడ్డాయి. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 4:08 pm IST

బంగ్లాదేశ్ స్టార్ లిటాన్ దాస్‌ను బేస్ ధర రూ.50 లక్షలకు కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు.

Dec 23, 2022, 3:45 pm IST

ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ కోసం రాజస్థాన్, సన్‌రైజర్స్, లక్నో, బెంగళూరు మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. అతన్ని రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 3:38 pm IST

ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు 17.5 కోట్లకు అతన్ని ముంబై చేజిక్కించుకుంది.

Dec 23, 2022, 3:34 pm IST

ఐపీఎల్‌లో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా శామ్ కర్రాన్ రికార్డు సృష్టించాడు.

Dec 23, 2022, 3:33 pm IST

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ కోసం చెన్నై, రాజస్థాన్ గట్టిగా పోటీ పడ్డాయి. చివరకు అతన్ని రూ.5.75 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 3:31 pm IST

జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజాను బేస్ ధరకే పంజాబ్ కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 3:28 pm IST

వెస్టిండీస్ విధ్వంసకారుడు ఒడియన్ స్మిత్‌ను కనీస ధర రూ.50 లక్షలకే గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 3:26 pm IST

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్ కోసం గట్టి పోటీ జరిగింది. పంజాబ్, చెన్నై జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు రూ.18 కోట్ల భారీ ధరకు అతన్ని పంజాబ్ కొనేసింది.

Dec 23, 2022, 3:20 pm IST

బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లుగా ఉన్న షకీబల్ హసన్‌ను ఎవరూ కొనలేదు. బంగ్లా ఆటగాళ్లు సీజన్ మొత్తం అందుబాటులో ఉండకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా కనిపిస్తోంది.

Dec 23, 2022, 3:06 pm IST

ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్టు జో రూట్, సౌతాఫ్రికా స్టార్ రైలీ రూసో ఇద్దరిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో మొదటి సెట్ వేలం ముగిసింది.

Dec 23, 2022, 3:03 pm IST

మరో సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేను చెన్నై అతని బేస్ ధర రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 3:02 pm IST

టీమిండియా వెటరన్ మయాంక్ అగర్వాల్ కోసం సన్‌రైజర్స్ పోటీ పడింది. చివరకు 8.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.

Dec 23, 2022, 2:55 pm IST

హరీ బ్రూక్‌కు రూ.13.25 కోట్లు

ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ఇంగ్లండ్ ప్లేయర్ కోసం తీవ్రంగా పోటీపడ్డ రాజస్థాన్, హైదరాబాద్.

Dec 23, 2022, 2:45 pm IST

గుజారత్ టైటాన్స్‌కు కేన్ విలియమ్సన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అతని కనీస ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్.

Dec 23, 2022, 2:44 pm IST

మొదలైన ఐపీఎల్ 2023 మెగా వేలం

మొదలైన ఐపీఎల్ 2023 మెగా వేలం.. తొలి సెట్‌లో బ్యాటర్ల వేలం పాటు

Dec 23, 2022, 2:09 pm IST

ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను బీసీసీఐ తీసుకొచ్చింది. మినీ వేలంపై ఈ నిబంధన కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dec 23, 2022, 1:36 pm IST

ఐపీఎల్ మినీ వేలాన్ని మనందరం టీవీల్లోనో, మొబైల్స్‌లోనో చూస్తాం. ఈ మెగా ఈవెంట్ తెర వెనుక ఏం జరుగుతుందో ఐపీఎల్ యాజమాన్యం వివరించింది. ఫ్రాంచైజీలకు రూల్స్ చెప్పడం, వేలం నిర్వహణ తదితర అంశాలను వివరించింది.

Dec 23, 2022, 1:22 pm IST

పర్సులో అత్యంత తక్కువ డబ్బు ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ వేలంలో కనీసం నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. దీంతో తమ వద్ద ఉన్న 7.05 కోట్లతో దేశవాళీ స్టార్లపై ఫోకస్ పెట్టాలని కేకేఆర్ నిర్ణయించుకుంది.

Dec 23, 2022, 1:08 pm IST

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అల్లా మహమ్మద్ ఘజనఫర్ ఈ వేలంలో పాల్గొంటున్న అత్యంత చిన్న వయసున్న ప్లేయర్. 15 సంవత్సరాల ఈ ప్లేయర్‌పై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Dec 23, 2022, 12:47 pm IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నిఖార్సయిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడు. దీంతో ఎలాగైనా బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, శామ్ కర్రాన్, జేసన్ హోల్డర్‌లలో ఒకరిని దక్కించుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

Dec 23, 2022, 12:33 pm IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మొత్తం 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో నాలుగు విదేశీ ప్లేయర్లకు కేటాయించినవి. వీటిని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి.

Dec 23, 2022, 11:45 am IST

ఆటగాళ్ల ఫామ్‌ను గమనిస్తూ వస్తున్న ఫ్రాంచైజీలు వేలానికి సిద్ధం అయ్యాయి. తాము కొనాలని అనుకునే ఆటగాళ్ల లిస్టులు తయారు చేసుకొని రెడీగా ఉన్నాయి.

Dec 23, 2022, 11:30 am IST

మినీ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్ అందినట్లు సమాచారం. ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది.

Dec 23, 2022, 11:15 am IST

మొత్తం 405 మందినీ మినీ వేలంలో వేలం వేయరు. మొదటి 13 సెట్స్‌లో ఉన్న 86 మందినీ మాత్రమే వేలం వేస్తారు. మిగతా ఆటగాళ్ల పేర్లను చక చకా పిలిచేసి చేతులు దులుపుకుంటారు. ఈ క్రమంలో ఫ్రాంచైజీలను కనీసం పది పేర్లు ఇవ్వాలని అడుగుతారు. వారి పేర్లను 86 మందిలో అమ్ముడుపోని ఆటగాళ్లతో కలిపి వేలం వేస్తారు.

Dec 23, 2022, 11:01 am IST

వచ్చే ఏడాదికి దాదాపుగా జట్టు కూర్పు పూర్తయిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే మినీ వేలంలతో తమకు దక్కే అవకాశాలను వదులుకోమని కోచ్ హెసాన్ అంటున్నాడు.

Dec 23, 2022, 10:39 am IST

ధోనీ సలహా అదే..

వేలానికి చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్ కోసం ఎంతైనా ఖర్చు చేయాలని ధోనీ సూచించినట్లు తెలుస్తోంది.

Dec 23, 2022, 10:30 am IST

బెన్ స్టోక్స్ దొరక్కపోతే.. జేసన్ హోల్డర్‌ను తీసుకొని జట్టు పగ్గాలు అందించాలని సన్‌రైజర్స్ అనుకుంటోంది.

Dec 23, 2022, 10:23 am IST

బెన్ స్టోక్స్ కోసం సీఎస్‌కే, సన్‌రైజర్స్, ముంబై, రాజస్థాన్, లక్నో, పంజాబ్, గట్టిగా పోటీ పడనున్నాయి.

Dec 23, 2022, 10:10 am IST

బుమ్రాకు మంచి బ్యాకప్ పేసర్ కోసం ముంబై వెతుకుతోంది.

Dec 23, 2022, 10:05 am IST

బెన్ స్టోక్స్‌ను ఫినిషర్‌గా తీసుకోవాలని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి.

Dec 23, 2022, 9:05 am IST

కామెరూన్ గ్రీన్‌ను సన్‌రైజర్స్ టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Story first published: Friday, December 23, 2022, 8:55 [IST]
Other articles published on Dec 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+