
వేలంపాటలో పాల్గొనే ఫ్రాంఛైజీలు ఇవే..
ఐపీఎల్ 2022 మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి. పాత ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి. రిటైనింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో- ఒక్కో జట్టులో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరనున్నాయి.
ప్రీతిజింతా డుమ్మా
ఈ మెగా వేలం పాటకు సాధారణంగా అన్ని ఫ్రాంఛైజీలకు చెందిన ఓనర్లు హాజరవుతుంటారు. హెడ్ కోచ్ సహా కనీసం అయిదుమంది ఈ వేలంలో పాల్గొంటుంటారు. తమకు నచ్చిన ప్లేయర్‌ను సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ వేలంపాటకు పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతిజింతా డుమ్మా కొట్టనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని ఆమె తన అఫీషియల్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పోస్ట్ చేశారు. అటెండ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించారు.
యూఎస్ నుంచి రావాలంటే కష్టం..
ప్రస్తుతం ప్రీతిజింతా తన భర్త జీన్ గుడెనఫ్‌తో కలిసి అమెరికాలో నివసిస్తోన్నారు. గత ఏడాది నవంబర్‌లో ప్రీతిజింతా సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. ఇంట్లో నాలుగు నెలల కవల పిల్లలను వదిలేసి, బెంగళూరుకు ట్రావెల్ చేయలేనని స్పష్టం చేశారు. ఐపీఎల్ మెగా వేలం ఈవెంట్‌ను మిస్ అవుతున్నానని చెప్పారు. అయినప్పటికీ- దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానని అన్నారు. ప్లేయర్ల సెలెక్షన్‌పై ఫ్రాంఛైజీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించాననీ పేర్కొన్నారు.
ఫ్యాన్స్ నుంచి సజెషన్స్..
జట్టులో ఎలాంటి ప్లేయర్లను తీసుకోవాలనే విషయంపై అభిమానులు, నిపుణుల నుంచి సలహాలను సైతం తీసుకున్నామని ప్రీతిజింతా తెలిపారు. పంజాబ్ కింగ్స్ రెడ్ జెర్సీని ఎవరు ధరిస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులందరితో పాటు తాను కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇదివరకు ఐపీఎల్ వేలంపాటల్లో పాల్గొన్న ఓ థ్రోబ్యాక్ ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు. కొత్త ప్లేయర్లకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుదామని పేర్కొన్నారు.

రూ.72 కోట్లు బ్యాలెన్స్..
ప్రస్తుతం- పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ అకౌంట్‌లో 72 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ మొత్తంతో కొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. ఈ జట్టు ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. 12 కోట్ల రూపాయలతో మయాంక్ అగర్వాల్, నాలుగు కోట్ల రూపాయలతో అర్ష్‌దీప్ సింగ్‌ను అట్టి పెట్టుకుందీ ఫ్రాంఛైజీ. ఈ ఇద్దరు పోగా.. మిగిలిన ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికోసం ఆ ఫ్రాంఛైజీ ప్రతినిధులు బెంగళూరు మెగా ఆక్షన్‌కు హాజరు కానున్నారు.


Click it and Unblock the Notifications
