IPL Auction 2022: తొలి రోజు వీరిదే హవా: కోట్లు గుమ్మరించడానికి సర్వం సిద్దం

బెంగళూరు: క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2022, 15వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్‌లో ఆడబోయే క్రికెటర్ల కోసం మెగా వేలంపాటకు ముహూర్తం సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. శనివారం ఉదయం 11 గంటలకు మెగా వేలంపాట ఆరంభం కానుంది. ఆదివారం కూడా కొనసాగుతుంది. సిలికాన్ సిటీ బెంగళూరు- ఈ మెగా ఆక్షన్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చింది. హోటల్ ఐటీసీ గార్డెనియాలో ఈ వేలం పాటను నిర్వహించనున్నారు. ఈ దఫా ఈ వేలంపాటలో 10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోతోన్నాయి. క్రికెటర్ల పంట పండించనున్నాయి.
ఐపీఎల్ 2022 మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి. పాత ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి. రిటైనింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో- ఒక్కో జట్టులో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరనున్నాయి.
శనివారం నిర్వహించబోయే తొలి రోజు మెగా వేలంపాటలో 161 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు కోట్ల రూపాయల రిజర్వ్ ప్రైస్‌గా ఉన్న ప్లేయర్లు చాలామందే ఉండనున్నారు. ప్రత్యేకించి- డైనమిక్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఏస్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీతో పాటు విదేశీ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్, కగిసొ రబడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.
బెంగళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి అంతా సిద్ధమైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగబోయే ఈ వేలానికి సంబంధించిన మాక్ డ్రిల్ కూడా పూర్తయ్యింది. వేలంలో పాల్గొనబోయే వారికి పాటించాల్సిన నిబంధనలపై కూడా బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలకు తెలిపింది. మెగా వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సుమారు 1,200 మంది దాకా క్రికెటర్లు తమ పేర్లను పంపించగా.. అందులో బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఇక ఈ 590 మందిలోంచి వేలం తొలి రోజు.. అంటే శనివారం అదృష్టాన్ని పరీక్షించుకోబోయే ఆటగాళ్లు 161 మంది ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications