
గౌతమ్ కోసం చెన్నై పోటీ:
రెండేళ్లుగా దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఆడని క్రిస్ మోరిస్ కోసం రాజస్థాన్ రాయల్స్ కోట్లు కుమ్మరించడం విశేషం. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 70 మ్యాచ్‌లు ఆడిన మోరిస్.. 551 పరుగులు చేయడంతో పాటు 80 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున కనీసం ఒక మ్యాచ్ కూడా ఆడని స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 9.25 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్‌లో ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు దక్కిన అత్యధిక ధర ఇదే. దేశవాళీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకి వచ్చిన షారుక్ ఖాన్ కోసం పంజాబ్ రూ. 5.25 కోట్లు వెచ్చించింది.

అన్‌క్యాప్‌డ్ ఆటగాడికి ఇదే తొలిసారి:
గత ప్రదర్శనతో సంబంధం లేకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.14.25 కోట్లు పెట్టి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసుకుంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్లు ఉన్నా మిడిలార్డర్‌లో మంచి ఫినిషర్ లేని లోటుతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు.. దాన్ని భర్తీ చేసుకునేందుకు మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకుంది. బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడానికి న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్‌ను రూ. 15 కోట్లకు కొనుగోలు చేసింది. టెస్టు క్రికెటర్‌గా ముద్రపడ్డ జెమీసన్‌కు ఇంత భారీ మొత్తం వెచ్చించడం విశేషం. చేతినిండా డబ్బులతో వేలంలోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా పేసర్ జే రిచర్డ్‌సన్‌ను రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొడుతున్న ఆసీస్ దేశవాళీ పేసర్ రిలె మెరెడిత్ కోసం రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. విదేశీ అన్‌క్యాప్‌డ్ ఆటగాడు ఐపీఎల్‌లో ఇంత భారీ మొత్తం దక్కించుకోవడం ఇదే తొలిసారి.

ముగ్గురు ఆటగాళ్లనే:
భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఆరేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. గత ఆరు సీజన్‌లలో అమ్ముడుపోని పుజారాను ఈ సారి చెన్నై.. అతడి కనీస ధర రూ. 50 లక్షలకు కైవసం చేసుకుంది. పుజారా చివరిసారి 2014లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ బరిలోకి దిగాడు. ఇక వేలంలో మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గురు ఆటగాళ్లనే కొనుగోలు చేసుకుంది. వెటరన్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్, జగదీశ సుచిత్‌ను కొనుగోలు చేసింది.

ప్రాంఛైజీలు తీసుకున్న ఆటగాళ్ల లిస్ట్:
చెన్నై సూపర్ కింగ్స్: కృష్ణప్ప గౌతమ్ (రూ.9.25 కోట్లు), మొయిన్ అలీ (రూ.7 కోట్లు), పుజారా (రూ.50 లక్షలు), భగత్ వర్మ (రూ.20 లక్షలు), హరి నిశాంత్ (రూ.20 లక్షలు), హరిశంకర్ రెడ్డి (రూ.20 లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్: టామ్ కరన్ (రూ.5.25 కోట్లు), స్మిత్ (రూ.2.2 కోట్లు), బిల్లింగ్స్ (రూ.2 కోట్లు), ఉమేశ్ (రూ.కోటి), రిపల్ పటేల్ (రూ.20 లక్షలు), విష్ణు వినోద్ (రూ.20 లక్షలు), లక్మన్ మెరివాలా (రూ.20 లక్షలు), సిద్ధార్థ్ (రూ.20 లక్షలు)
కోల్‌కతా నైట్‌రైడర్స్: షకీబ్ అల్ హసన్ (రూ.3.2 కోట్లు), హర్భజన్ (రూ.2 కోట్లు), బెన్ కటింగ్ (రూ.75 లక్షలు), కరుణ్ నాయర్ (రూ.50 లక్షలు), పవన్ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్ అయ్యర్ (రూ.20 లక్షలు), షెల్డన్ జాక్సన్ (రూ.20 లక్షలు), వైభవ్ అరోరా (రూ.20 లక్షలు)
ముంబై ఇండియన్స్: కౌల్టర్‌నైల్ (రూ.5 కోట్లు), ఆడమ్ మిల్నె (రూ.3.2 కోట్లు), పియూష్ చావ్లా (రూ.2.4 కోట్లు), నీషమ్ (రూ.50 లక్షలు), యుధ్‌వీర్ (రూ.20 లక్షలు), జాన్సన్ (రూ.20 లక్షలు), అర్జున్ తెందుల్కర్ (రూ.20 లక్షలు)
పంజాబ్ కింగ్స్: రిచర్డ్‌సన్ (రూ.14 కోట్లు), మెరెడిత్ (రూ.8 కోట్లు), షారుఖ్ ఖాన్ (రూ.5.25 కోట్లు), హెన్రిక్స్ (రూ.4.20 కోట్లు), మలన్ (రూ.1.50 కోట్లు) ఫాబియాన్ అలెన్ (రూ.75 లక్షలు), జలజ్ సక్సేనా (రూ.30 లక్షలు), సౌరభ్ కుమార్ (రూ.20 లక్షలు), ఉత్కర్ష్ (రూ.20 లక్షలు)
రాజస్థాన్ రాయల్స్: మోరిస్ (రూ.16.25 కోట్లు), శివమ్ దూబె (రూ.4.4 కోట్లు), చేతన్ సకారియా (రూ.1.2 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ.కోటి), లివింగ్‌స్టన్ (రూ.75 లక్షలు), కరియప్ప (రూ.20 లక్షలు), ఆకాశ్ సింగ్ (రూ.20 లక్షలు), కుల్‌దీప్ (రూ.20 లక్షలు),
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జేమీసన్ (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ.14.25 కోట్లు), క్రిస్టియన్ (రూ.4.8 కోట్లు), సచిన్ బేబి (రూ.20 లక్షలు), రజత్ (రూ.20 లక్షలు), మహమ్మద్ అజహరుద్దీన్ (రూ.20 లక్షలు), ప్రభుదేశాయ్ (రూ.20 లక్షలు), కేఎస్ భరత్ (రూ.20 లక్షలు)
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేదార్ జాదవ్ (రూ.2 కోట్లు), ముజీబ్ రెహమాన్ (రూ.1.50 కోట్లు), సుచిత్ (రూ.30 లక్షలు)


Click it and Unblock the Notifications












