Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేలంలో భారీ ధర.. చిందేసిన హెట్‌మెయిర్‌ (వీడియో)

IPL Auction 2020: Shimron Hetmyer dances in joy after being sold to Delhi Capitals for Rs 7.75 crore

కోల్‌కతా: ఐపీఎల్‌-2020 కోసం జరిగిన వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు దూకుడు ప్రదర్శించాయి. తమకు కావాల్సిన స్టార్‌ క్రికెటర్ల కోసం ఎంతైనా వెచ్చించేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ పోటీ కారణంగానే ఆసీస్‌ పేసర్‌ ప్యాట్ కమిన్స్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 15 కోట్ల 50 లక్షలకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి వేలంలో అత్యధిక మొత్తం దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఢిల్లీకి హెట్‌మెయిర్‌:

ఢిల్లీకి హెట్‌మెయిర్‌:

ఆసీస్ ఆటగాళ్ల తర్వాత ఫ్రాంచైజీలు వెస్టిండీస్‌ ఆటగాళ్లపై కన్నేశారు. పేసర్ షెల్డాన్‌ కాట్రెల్, బ్యాట్స్‌మన్‌ షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌లకు భారీ ధర పలికింది. కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ రూ.8.50 కోట్లకు కాట్రెల్‌ను కనుగోలు చేయగా.. రూ.7.75 కోట్లకు హెట్‌మెయిర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆనందంలో తేలాడుతున్నారు.

చిందేసిన హెట్‌మెయిర్‌:

చిందేసిన హెట్‌మెయిర్‌:

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ ఆనందంతో హోటల్ గదిలోనే చిందేశాడు. వేలంను లైవ్ ద్వారా చూస్తున్న హెట్‌మెయిర్‌.. తనను ఢిల్లీ భారీ మొత్తంలో కనుగోలు చేయడంతో సంతోషంలో చిందులేశాడు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 'హెట్‌మెయిర్.. ఢిల్లీ జట్టులోకి స్వాగతం. మన అభిమానులకు నీ అనుభూతిని పంచగలవా?. వేలం అనంతరం హెట్‌మెయిర్‌ ఇలా' అని ట్వీట్‌ చేసింది.

తొలి వన్డేలో మెరుపు సెంచరీ:

బెంగళూరు హెట్‌మెయిర్‌ను వదులుకోగా.. కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఢిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్‌ పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ భారీ ధరతో సొంతం చేసుకుంది. ప్రస్తుతం హెట్‌మెయిర్‌ భారత పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి వన్డేలో మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఇక టీ20 సిరీస్‌లో ఫర్వాలేదనిపించాడు. వెస్టిండీస్‌ తరఫున 16 టెస్టులు, 41 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 838 పరుగులు, వన్డేల్లో 1,379 పరుగులు, టీ20ల్లో 279 పరుగులు చేశాడు.

Story first published: Friday, December 20, 2019, 12:21 [IST]
Other articles published on Dec 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+