Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కమ్మిన్స్‌కు జాక్‌పాట్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర!!

IPL 2020 Auction : Pat Cummins Goes For Record Breaking Price By KKR ! || Oneindia Telugu
IPL Auction 2020: Pat Cummins bought for Rs 15.50 crore by KKR

కోల్‌కతా: ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ఆటగాళ్లు పాల్గొనగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్ల జోరు నడుస్తోంది. స్టార్ పేసర్‌ ప్యాట్స్‌ కమ్మిన్స్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. కమ్మిన్స్‌ కనీస ధర 2 కోట్లు కాగా.. రూ. 15.50 కోట్ల పెట్టి కేకేఆర్‌ దక్కించుకుంది. పలు ఫ్రాంచైజీలు కమిన్స్‌ కోసం పోటీ పడ్డాయి. ముఖ్యంగా రాయల్స్‌ చాలెంజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే కేకేఆర్‌ మాత్రం పట్టువిడవలేదు.

కమ్మిన్స్‌కు 10 కోట్ల వరకు ధర పలుకుతుందని అందరూ ఊహించనప్పటికీ.. అంతకుమించి అమ్ముడుపోయాడు. ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ గుర్తింపు పొందాడు. ఇక ఆస్ట్రేలియా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ కనీస ధరకే అమ్ముడుపోయాడు. కనీస ధర రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కైవసం చేసుకుంది. క్రిస్‌ లిన్‌పై మిగతా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లిన్‌కు నిరాశే ఎదురైంది.

కోల్‌కోత్‌ నైట్‌ రైడర్స్‌ కూడా తమ స్టార్‌ ఓపెనర్‌పై ఆసక్తి చూపలేదు. లిన్‌ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్‌ వదిలేసుకుంది. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్‌ తాజాగా తన పేరున రాసుకున్నాడు. కేకేఆర్‌ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్‌ సాధించడం విశేషం. అయినా లిన్‌ కోసం పెద్దగా పోటీ లేకుండా పోయింది.

Story first published: Thursday, December 19, 2019, 17:27 [IST]
Other articles published on Dec 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+