Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాట్రెల్‌కు కలిసొచ్చిన 'సెల్యూట్‌'.. కోట్లు కుమ్మరించిన పంజాబ్‌!!

IPL Auction 2020: Kings XI Punjab buy Sheldon Cottrell for Rs 8.5 crore

కోల్‌కతా: వెస్టిండీస్‌ స్టార్ పేసర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌కు అతని సెలెబ్రేషన్స్ విధానం ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలంలో బాగానే కలిసొచ్చింది. వికెట్ తీసిన అనంతరం అతడు చేసుకునే 'సెల్యూట్‌' సంబరాల కారణంగానే క్రికెట్ అభిమానులకు తెలిసాడు. మంచి పేస్ బౌలర్ అయిన కాట్రెల్‌ ఇటీవలి కాలంలో విండీస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో ఇతగాడు మోస్తరుగా రాణించాడు. అయినా పలు ఫ్రాంఛైజీలు కాట్రెల్‌కు కోసం పోటీ పడ్డాయి.

కింగ్స్‌ పంజాబ్‌ ఫ్రాంఛైజీ కాట్రెల్‌ను రూ. 8.50 కోట్లకు కొనుగోలు చేసింది. భారత్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో కాట్రెల్‌ భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ.. అత్యధిక ధరకు అమ్ముడుపోవడం కొసమెరుపు. వెస్టిండీస్‌ స్టార్‌ ఓపెనర్ షాయ్‌ హోప్‌ను ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. హోప్‌ కనీస ధర రూ. 50 లక్షలు ఉన్నా కూడా అతనిపై బిడ్‌ వేయడానికి ఫ్రాంఛైజీలు దైర్యం చేయలేదు. భారత పర్యటనలో హోప్‌ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ను సైతం కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. స్టెయిన్‌ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా.. అతనిపై బిడ్‌ వేయలేదు. భారత ఆటగాడు మోహిత్‌ శర్మ, శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుశాల్‌ పెరీరా కూడా అమ్ముడు పోలేదు. ఇక దేశవాళీ క్రికెటర్లు రైలీ మీరితీర్థ్, కేసీ కరియప్పలను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. యువ ఆటగాడు కేదార్ దేవధర్, ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్‌, ప్రభసిమ్రన్ సింగ్, అంకుష్ బెయిన్స్‌ కొనుగోలు కాలేదు.

Story first published: Thursday, December 19, 2019, 19:13 [IST]
Other articles published on Dec 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+