Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లాష్‌బ్యాక్ 2019: ఈ రికార్డు మరే బౌలర్‌కు లేదు.. అందుకేనా కమిన్స్‌కు రూ.15.50 కోట్లు!!

IPL Auction 2020: Australias Pat Cummins commands IPL record fee for an overseas player

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం కోల్‌కతాలో గురువారం జరిగిన వేలం పాట ముగిసింది. వేలంలో మరోసారి విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. గతంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ కళ్లు చెదిరే దరకు అమ్ముడుపోగా.. ఈసారి ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అంతకుమించి అమ్ముడుపోయాడు. తీవ్ర పోటీ మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.15.50 కోట్లకు కమిన్స్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియాకు ప్రధాన బౌలర్

ఆస్ట్రేలియాకు ప్రధాన బౌలర్

ఇంత ధరకు అమ్ముడుపోయినా.. ప్యాట్‌ కమిన్స్‌కు ఐపీఎల్‌లో 10 ఇన్నింగ్స్‌ల కన్నా ఎక్కువ అనుభవం లేకపోవడం విశేషం. 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వాడికి ఇన్ని కోట్లు అవసరమా? అని సగటు క్రికెట్ అభిమాని అనుకుంటున్నాడు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.15.50 కోట్లు పెట్టి కొనుక్కోవడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో ప్యాట్‌ కమిన్స్‌ ప్రధాన బౌలర్. మరో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా గాయాల కారణంగా జట్టులోకి వస్తూపోతూ ఉన్నా.. మనోడు మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడు.

బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలడు

కమిన్స్‌ బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగలడు. అద్భుత బంతులతో మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా ముప్పుతిప్పలు పెట్టగలడు. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వేసే బంతులకు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ లాంటి వారి వద్ద సమాధానం ఉండదు. ఇక అవసరం అయినపుడు బ్యాటుతోనూ మెరవగలడు. ప్రస్తుతం కమిన్స్‌ కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. అందుకే అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి.

ఈ రికార్డు మరే బౌలర్‌కు లేదు

ఈ రికార్డు మరే బౌలర్‌కు లేదు

కమిన్స్‌ తన టెస్ట్ కెరీర్‌లో 28 టెస్టులాడి 2.80 ఎకానమీతో 134 వికెట్లు తీశాడు. 58 వన్డేల్లో 5.14 ఎకానమీతో 96 వికెట్లు తీయగా.. 25 టీ20ల్లో 7.77 ఎకానమీతో 32 వికెట్లు కొల్లగొట్టాడు. ఈ గణాంకాలు చూస్తే బ్యాట్స్‌మెన్‌ను కమిన్స్‌ ఎలా ఆడుకుంటున్నాడో తెలుస్తుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ గాయాలు కాకుండా అతన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఎంపిక చేసిన సిరీసుల్లో మాత్రమే ఆడిస్తోంది. 2019లో టీ20ల్లో 9 వికెట్లు, వన్డేల్లో 31 వికెట్లు, టెస్టుల్లో 54 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఇలాంటి ప్రదర్శన మరే బౌలర్‌కు లేదు.

అగ్రస్థానంలో కమిన్స్‌

అగ్రస్థానంలో కమిన్స్‌

ప్రస్తుతం కమిన్స్‌ ఐసీసీ టెస్టు బౌలర్లలో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్యాట్‌ కమిన్స్‌ ఆసీస్ పిచ్‌లపైనే కాదు.. భారత పిచ్‌లపైనా రాణించగలరు. కమిన్స్‌ ఐపీఎల్‌లో 10 ఇన్నింగ్సులే ఆడినా 29.35 సగటుతో 17 వికెట్లు తీశాడు. కమిన్స్‌ను కొనుగోలు చేయడంలో కోల్‌కతా ప్రధాన కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. మరి అందరి అంచనాలను కమిన్స్‌ అందుకుంటాడో లేదో చూడాలి.

Story first published: Monday, December 23, 2019, 12:24 [IST]
Other articles published on Dec 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+