ఐపీఎల్ వేలం 2020: అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వెటరన్ క్రికెటర్లు వీరే!

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.
వేలంలో పాల్గొనే మొత్తం ఎనిమిది ప్రాంచైజీలు 73 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఈ ఐపీఎల్ ద్వారా గత పన్నెండు సీజన్లలో ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆటగాళ్ల వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత ఫామ్, ప్రతిభ ఆధారంగా వెటరన్ క్రికెటర్లకు కూడా ఫ్రాంఛైజీలు సొంతం చేసుకుంటాయి.

వచ్చే సీజన్ కోసం
ఈ క్రమంలో వచ్చే సీజన్ కోసం జరిగే వేలంలో పలువురు వెటరన్ క్రికెటర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ఈ జాబితాలో ఉన్నాడు. ప్రవీణ్ తాంబే వయసు 48 ఏళ్లు. క్రికెట్‌పై మక్కువతో కుర్రాళ్లతో పోటీపడి మరీ ఆడాలని చూస్తున్నాడు.

ఆసక్తి కనబరుస్తాయో లేదో
అయితే, వేలంలో ఫ్రాంఛైజీలు అతడి పట్ల ఆసక్తి కనబరుస్తాయో లేదో చూడాలి. ఐపీఎల్‌లో తాంబే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2013 సీజన్‌లో ఏకంగా 41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి అరుదైన రికార్డుని నెలకొల్పాడు.

2020 వేలంలో అత్యధిక వయసు కలిగిన ఆటగాళ్లు వీరే:
1. ప్రవీణ్ తాంబే - 48 ఏళ్లు
2. ఫవాద్ అహ్మద్ - 38
3. యూసుఫ్ పఠాన్ - 37
4.బెన్ లాలిన్ - 37
5. జీవన్ మెండిస్ - 37

'డాడీస్ ఆర్మీ'గా చెన్నై సూపర్ కింగ్స్
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక వయసు కలిగిన ఆటగాళ్లను కలిగిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల వయసు ముఫ్పైకి పైగా ఉండటంతో అభిమానులు ఆ జట్టుని 'డాడీస్ ఆర్మీ' అని ముద్దుగా పిలుచుకునే సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications