Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: వేలం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

హైదరాబాద్: ఐపీఎల్ 2018 వేలానికి సర్వం సిద్ధమైంది. ఐపీఎల్ 11వ సీజన్‌కు సంబంధించి జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలానికి సంబంధించి పూర్తి సమాచారం మీ కోసం:

ఐపీఎల్ వేలంను ఎలా నిర్వహిస్తారు?

ఐపీఎల్ వేలంను ఎలా నిర్వహిస్తారు?

ఐపీఎల్ వేలం కోసం ఇప్పటివరకు 578 క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరిని వారి రోల్స్‌ను బట్టిన గ్రూపులుగా విభజిస్తారు. వేలం వేసేవాడు ఒక్కో ప్లేయర్ పేరుని బహిరంగంగా చెబుతూ అతడి కనీస ధరను ప్రకటిస్తాడు. ఈ క్రమంలో ప్రాంఛైజీలు అతడి కనీస ధరకు ఓకే అయితే బిడ్డింగ్ వేస్తాయి. ఏదైనా ప్రాంఛైజీ బిడ్డింగ్‌లో ఆటగాడిని కోనుగోలు చేస్తే అతడు అమ్ముడుపోయినట్లు.

రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎమ్) కార్డు అంటే ఏమిటి?

రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎమ్) కార్డు అంటే ఏమిటి?

ఆటగాడి కోసం ఓ జట్టు బిడ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లైతే, వేలం వేసే వాడు ఆ ఆటగాడి మాజీ ఓనర్‌ను అడుగుతాడు. ఈ సమయంలో మాజీ ఓనర్‌ ఆ ఆటగాడిని కోనుగోలు చేయాలనుకుంటే రైట్ టు మ్యాచ్ కార్డు వినియోగించుకుంటాడు. దీంతో అంతకముందు ధరకే పాత ఓనర్ వేలంలో ఆ ఆటగాడిని దక్కించుకునే అవకాశం లభిస్తుంది.

వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల పరిస్థితి ఏంటీ?

వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల పరిస్థితి ఏంటీ?

ఐపీఎల్ 11వ సీజన్ కోసం వేలం 27, 28 తేదీల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో ఎవరైనా ప్లేయర్లు అమ్ముడు పోనట్లైతే... అందరు ప్లేయర్లు వేలం ముగిసిన తర్వాత మరోసారి వీరి గురించి వేలంలో మరోసారి ప్రస్తావన వస్తుంది. రెండోసారి వేలంలో ప్లేయర్లు కనీస ధర సగానికి పడిపోతుంది.

వేలం యొక్క ఆర్థిక వ్యవస్థ

వేలం యొక్క ఆర్థిక వ్యవస్థ

ఫ్రాంచైజీలు: 8.

చేతిలో ఉన్న నగదు: Rs 422.5 crore.

ఎంత మందిని కోనుగోలు చేయొచ్చు: Maximum 182.

మొత్తం ఎంతమంది: 578

వేలంలో భారత ఆటగాళ్ల సంఖ్య: 360.

వేలం వేదిక: ITC Royal Gardenia, Bengaluru

వేలం వేసేవాడు: Richard Madley

ఎవరీ రిచర్డ్ మాడ్లీ

ఎవరీ రిచర్డ్ మాడ్లీ

రిచర్డ్ మాడ్లీ సర్రే క్రికెట్ లీగ్ తరుపున క్రికెట్ ఆడాడు. 1978లో ఈ వేలం వేసే కెరీర్‌ను వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రస్తుతం రిచర్డ్ మాడ్లీ న్యూయార్క్‌లో ఉన్న క్రిస్టీ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ కోసం అప్పటి ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ రిచర్డ్ మాడ్లీని ఆక్షనర్‌గా పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు రిచర్డ్ మాడ్లీ ఐపీఎల్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

వేలానికి ఎవరి జేబులో ఎంతెంత నగదు?

వేలానికి ఎవరి జేబులో ఎంతెంత నగదు?

రాజస్థాన్ రాయల్స్: Rs 67.5 crore

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: Rs 67.5 crore

సన్ రైజర్స్ హైదరాబాద్: Rs 59 crore

కోల్ కతా నైట్ రైడర్స్: Rs 59 crore

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: Rs 49 crore

చెన్నై సూపర్ కింగ్స్: Rs 47 crore

ఢిల్లీ డేర్ డెవిల్స్: Rs 47 crore

ముంబై ఇండియన్స్: Rs 47 crore

Story first published: Tuesday, January 23, 2018, 18:06 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+