For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2018: కోట్లు పలికిన యువ క్రికెటర్లు వీరే

By Nageshwara Rao
IPL auction 2018: Uncapped India & international youngsters fetch big money

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి రోజు వేలం ముగిసింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా వేదికగా జరిగిన తొలి రోజు వేలంలో అండర్-19 జట్టుకు ఆడుతున్న యువ క్రికెటర్లు రికార్డు ధరలకే అమ్ముడుపోయారు. స్వదేశీ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా పెద్ద మొత్తంలో పలకడం విశేషం.

న్యూజిలాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతోన్న అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్‌కోటి అత్యధికంగా రూ.3.2 కోట్లు పలికాడు. వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. ఇక, అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పృథ్వీ షాను వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకుంటుందని అంతా భావించారు.

IPL auction 2018: Uncapped India & international youngsters fetch big money

అయితే అనూహ్యంగా అతడిని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక వెస్టిండిస్ యువ క్రికెటర్ జోఫ్రా అర్చర్‌ కోసం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 7.2 కోట్లకు సొంతం చేసుకుంది. వీరితో పాటు మరికొందరు యువ ఆటగాళ్లు ఏ జట్టులో చోటు దక్కించుకున్నారో ఒక్కసారి చూద్దాం.

* కృనాల్‌ పాండ్య - ముంబై ఇండియన్స్‌ - రూ.8.8 కోట్లు

* సూర్యకుమార్‌ యాదవ్‌ - ముంబై ఇండియన్స్‌ - రూ.3.2 కోట్లు

* దీపక్‌ హుడా - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.3.6 కోట్లు
* రికీ భూయి - సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ - రూ.20 లక్షలు

* నితీశ్‌ రానా - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - రూ.3.4 కోట్లు
* శుభమాన్ గిల్: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 1.8 కోట్లు

* అంబటి రాయుడు - చెన్నై సూపర్‌కింగ్స్‌ - రూ.2.2 కోట్లు

IPL auction 2018: Uncapped India & international youngsters fetch big money

* విజయ్‌ శంకర్‌ - ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ - రూ.3.2 కోట్లు
* రాహుల్‌ తెవాటియా - ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ - రూ.3 కోట్లు
* హర్షల్ పటేల్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 20 లక్షలు
* పృథ్వీ షా: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 1.2 కోట్లు

* మయాంక్‌ అగర్వాల్‌ - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ - రూ. కోటి

* నాగర్‌కోటి - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - రూ.3.2 కోట్లు
* శుభ్‌మన్‌ గిల్‌ - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - రూ.1.8 కోట్లు

* ఇషాంక్‌ జగ్గి - రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.20 లక్షలు
* రాహుల్‌ త్రిపాఠి - రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.3.4 కోట్లు
* జోఫ్రా ఆర్చర్: రాజస్థాన్ రాయల్స్ - రూ. 7.2 కోట్లు

* మనన్‌ ఓహ్రా - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - రూ.1.1 కోట్లు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 27, 2018, 19:04 [IST]
Other articles published on Jan 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+