
నైట్ రైడర్స్ జట్టుకు 1.8 కోట్లకు:
ప్రారంభ ధర 20 లక్షలుగా ప్రకటించిన అతనిని 1.8 కోట్లకు కొనుగోలు చేశారు. పద్దెనిమిదేళ్ల ఈ కుర్రాడు బెంగుళూరు వేదికగా జరిగిన వేలంలో నైట్ రైడర్స్ జట్టుకు అమ్ముడుపోయాడు. ఇతనితో పాటుగా అండర్-19 జట్టు నుంచి పృథ్వీ షా 1.2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు, మీడియం ఫేసర్ అయిన కమలేశ్ నాగర్ కోటి అదే జట్టు అయిన నైట్ రైడర్స్‌కు 3.2 కోట్లకు అమ్ముడుపోయాడు.

అతని పేరు ఐపీఎల్ జాబితాలో చూసి:
రైతు కొడుకైన 18 ఏళ్ల శుబ్‌మాన్ రెండేళ్ల నుంచి అండర్ వరల్డ్ కప్ కోసం శిక్షణ పొందుతున్నాడు. దీంతో అతనిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదులుకోవాలనుకోలేదు. భారత్ నుంచి న్యూజిలాండ్ వెళ్లినప్పటి నుంచి అతను వరల్డ్ కప్ ట్రోఫీ గెలుచుకోవాలనే ధ్యాస మీదే ఉన్నాడు. అతని పేరు వేలం జాబితాలో చూసి ఆశ్చర్యపోయామని అతని తల్లిదండ్రులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ అతని గురించి తలచుకొని ఆనందపడ్డారు.

రెండేళ్ల పాటు శిక్షణలోనే:
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శుబ్‌మాన్ 63 పరుగులు చేసి బ్యాటింగ్‌లో తన ప్రతిభను చూపించుకున్నాడు. ఓపెనింగ్ మ్యాచ్ లో అయితే 90పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ లో ఆడి టాప్ రేంజిలో నిలిచాడు.

న్యూజిలాండ్ వేదికగా జరగనున్న మ్యాచ్ కోసం:
భారత జట్టు ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 203 పరుగుల తేడాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడించింది. భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో తలపడనుంది. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న మ్యాచ్ ఫిబ్రవరి 3వ తేదీ జరుగుతుంది.

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి:
న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్‌కు భారత జట్టు అడుగు దూరంలో నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది.

భారత్‌కు అత్యధిక పరుగులు:
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ సెంచరీ(102)తో రాణించాడు. కెప్టెన్ పృథ్వీ షా(41), మన్‌జ్యోత్ కల్రా(47), సుధాకర్ రాయ్(33) పరుగులతో ఫరవాలేదనిపించారు.


Click it and Unblock the Notifications











