
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ముగిసింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ వేదికగా ఈ వేలం రెండు రోజుల పాటు జరిగింది. ఈ వేలంలో మొత్తం 578 మంది క్రికెటర్లకు బీసీసీఐ అనుమతిచ్చింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలంలో మొత్తం 169 మంది క్రికెటర్లు అమ్ముడుపోయారు.
ఇందులో 56 మంద విదేశీ అటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో కోసం 8 ప్రాంఛైజీలు మొత్తం రూ. 4,31,70,00,000 కోట్లను ఖర్చు చేశాయి. గతేడాది లాగే ఈసారి కూడా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రూ.12.5 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఈసారి వేలంలో భారత ఆటగాళ్లకు కోట్లు దక్కాయి.
భారత్ తరుపున అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనాదఖ్త్ నిలిచాడు. ఆదివారం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.11.5 కోట్లతో ఉనాదఖ్త్‌ను సొంతం చేసుకుంది. మనీష్ పాండే, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, కృనాల్ పాండ్యాలాంటి వారు కూడా కోట్లు పలికారు. ఏ ప్లేయర్ ఎన్ని కోట్లు పలికాడో ఒక్కసారి చూద్దాం:
కోట్లు పలికిన భారత క్రికెటర్లు:
* జయదేవ్ ఉనద్కట్ (రూ.11.5 కోట్లు, రాజస్థాన్ రాయల్స్)
* మనీష్ పాండే (రూ.11 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
* కేఎల్ రాహుల్ (రూ.11 కోట్లు, కింగ్స్ పంజాబ్)
* కృనాల్ పాండ్యా (రూ.8.8 కోట్లు, ముంబై ఇండియన్స్)
* సంజు శాంసన్ (రూ.8 కోట్లు, రాజస్థాన్ రాయల్స్)
* కేదార్ జాదవ్ (రూ.7.8 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్)
* అశ్విన్ (రూ.7.6 కోట్లు, కింగ్స్ పంజాబ్)
* దినేష్ కార్తీక్ (రూ.7.4 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
* రాబిన్ ఉతప్ప (రూ.6.4 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
* కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు, కింగ్స్ పంజాబ్)
* శిఖర్ ధావన్ (రూ.5.2 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
* కరణ్ శర్మ (రూ.5 కోట్లు, చెన్నై సూపర్‌కింగ్స్)
* వృద్ధిమాన్ సాహా (రూ.5 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
కోట్లు కొల్లగొట్టిన విదేశీ క్రికెటర్లు:
* బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు, రాజస్థాన్ రాయల్స్)
* * క్రిస్ లిన్ (రూ.9.6 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
మిచెల్ స్టార్క్ (రూ.9.4 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
* గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.9 కోట్లు, ఢిల్లీ డేర్‌డెవిల్స్)
* రషీద్ ఖాన్ (రూ.9 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
* క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
* ఆండ్రూ టై (రూ.7.2 కోట్లు, కింగ్స్ పంజాబ్)
* డ్వేన్ బ్రేవో (రూ.6.2 కోట్లు, చెన్నై సూపర్‌కింగ్స్)
* కీరన్ పొలార్డ్ (రూ.5.4 కోట్లు, ముంబై ఇండియన్స్)
* పాట్ కమిన్స్ (రూ.5.4 కోట్లు, ముంబై ఇండియన్స్)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.