ఐపీఎల్: ఐపీఎల్‌లో ఆడనున్న విదేశీ క్రీడాకారులు వీరే
హైదరాబాద్: ఏదైనా జాతీయ జట్టులోకి తీసుకోవాలంటే అన్ని నైపుణ్యాలతో పాటు ఏదో ఒక దాంట్లో ప్రత్యేకత ఉండాలి. అది బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ఏదైనా కావొచ్చు. కానీ, అన్ని సమపాళ్లలో కలిసి ఉన్న ఆల్ రౌండర్స్ కూడా చాలా సార్లు మ్యాచ్‌కు కీలకంగా మారతారు. ప్రస్తుతం ఐపీఎల్ వేలంలోనూ అదే ఉద్దేశ్యంతో ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. వీరిలో బెన్ స్టోక్స్ ముఖ్యడు అని చెప్పాలి.

బెన్ స్టోక్స్ స్థాయి ఏంటో:
ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఆఫ్ ఫీల్డ్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వడు. తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో మ్యాచ్ స్థితి గతులను ఇట్టే మార్చేయగలడు. ఈ మధ్యే న్యూజిలాండ్‌తో ఆడిన ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ స్థాయి ఏంటో అందరికీ మరో సారి తెలియజేశాడు.

త్రినిదాడియన్ అనే:
చెన్నై సూపర్ కింగ్స్ త్రినిదాడియన్ అనే ముద్దు పేరుతో పిలుచుకునే బ్రావో జట్టులో మంచి అభిమానం చూరగొన్న వ్యక్తి. ఈ సారి అతనిని రిటెన్షన్ లిస్లులో ప్రకటించలేదు. దీంతో మిగిలిన అన్ని జట్లు బ్రావోను కొనుగోలు చేయాలని ఆరాటపడుతున్నాయి. బ్రావో బ్యాటింగ్ అంటేనే ప్రత్యర్థి జట్టుకు హడల్. స్లో బౌన్సర్ అయినా నెమ్మదిగా వచ్చే బంతినైనా నేర్పుగా ఆడగలడు.

బంగ్లాదేశ్ ఆటగాడైన హసన్:
ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్స్ జాబితాలో షాకిబ్ అల్ హసన్ ఒకడు. బంగ్లాదేశ్ ఆటగాడైన హసన్ ఇంతకుముందు ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. వేగంగా పరుగులు చేయడంలో దిట్ట. ఎడమ చేతి వాటంతో బౌలర్లను అదరగొడుతుంటాడు. ఒక్కోసారి ఇదే కారణంతో త్వరగా పెవిలియన్‌కు చేరుకుంటాడు. హసన్ ఐసీసీ విడుదల చేసిన టీ 20 ర్యాంకింగ్స్‌లో టాప్ లిస్ట్‌లో ఒకడిగా ఉన్నాడు.

బిగ్ బాష్ లీగ్‌లో:
డార్సీ షార్ట్ ఇతనొక లేటెస్ట్ సెన్సేషన్. బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హర్రీకేన్స్ జట్టు తరపున ఆడి మంచి స్కోరు చేశాడు. ఐపీఎల్ వేలం జాబితాలో టాప్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఎడమ చేతి వాటం కలిగి ఉన్న స్పిన్నర్ కూడా. ఇతని స్థాయి ఎంత పెరిగిందంటే డేవిడ్ వార్నర్ తో పోల్చుకునే అంత.

న్యూజిలాండ్ ప్లేయర్ కొలిన్ గ్రాండ్‌హోమ్:
న్యూజిలాండ్ ప్లేయర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ జనవరి నెలారంభంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ వేలానికి సరిపడ అర్హతలున్న వ్యక్తి కావడంతో ఇతన్ని తీసుకోవడంపై జట్టు యాజమాన్యాలు
పరిశీలనలో ఉన్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications