Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: బరిలోకి దిగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే

IPL 2018 : Sunrisers Hyderabad Squad Analysis
IPL auction 2018 Sunrisers Hyderabad: Full list of players bought by SRH

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ప్రక్రియ ముగిసింది. దీంతో వచ్చే సీజన్‌లో ఏయే ఆటగాళ్లు ఏయే జట్టు తరుపున ఆడనున్నారో తెలిసిపోయింది. ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వేలానికి ముందు కెప్టెన్ డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల సమాచారం

రెండు రోజుల పాట జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శిఖర్ ధావన్, రషీద్ ఖాన్, దీపక్ హుడాలను రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి తమతోనే ఉంచుకుంది. దీనిని బట్టి చూస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పాత ఆటగాళ్లనే తిరిగి తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తిని కనబర్చింది. మొత్తం జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లతో పాటు ఎనిమిది మంది బౌలర్లు ఉన్నారు.

వృద్ధిమాన సాహా, శ్రీవాస్త్ గోస్వామిల రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లను జట్టులోకి తీసుకుంది. మిగతా ఆటగాళ్లంతా ఆల్‌రౌండర్లే కావడం వచ్చే సీజన్‌లో హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. ఈసారి వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీష్ పాండేకు అత్యధికంగా రూ. 11 కోట్లు చెల్లించి వేలంలో సొంతం చేసుకుంది.

మరోవైపు టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన యూసఫ్ పఠాన్‌ను రూ. 1.9 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. పంజాబ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ కోసం వేలంలో పోటీ పడి రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇలా మొత్తం ఐపీఎల్ 11వ సీజన్ కోసం 25 మంది ఆటగాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది.


సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:
1. డేవిడ్ వార్నర్ - రూ. 5 కోట్లు
2. భువనేశ్వర్ కుమార్ - రూ. 5 కోట్లు

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
3. శిఖర్ ధావన్ - రూ. 5 కోట్లు [RTM]
4. షకీబ్ అల్ హసన్ - రూ.2 కోట్లు
5. కేన్ విలియమ్సన్ - రూ.3 కోట్లు
6. మనీష్ పాండే - రూ. 11 కోట్లు
7. కార్లోస్ బ్రాత్‌వైట్ - రూ.2 కోట్లు
8.యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు
9. వృద్ధిమాన్ సాహా - రూ. 5 కోట్లు
10. కర్ణ్ శర్మ- రూ. 5 కోట్లు
11. రషీద్ ఖాన్ - రూ.9 కోట్లు [RTM]
12. రిక్కీ భుయి - రూ.20 లక్షలు
13. దీపక్ హుడా- రూ.3.6 కోట్లు [RTM]
14. సిద్ధార్థ్ కౌల్‌ - రూ.3.8 కోట్లు
15. నటరాజన్‌ - రూ.40 లక్షలు
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్‌ - రూ.3 కోట్లు
17. మహ్మద్ నబీ- రూ. కోటి
18. సందీప్ శర్మ- రూ. 3 కోట్లు
19. సచిన్ బేబీ- రూ. 20 లక్షలు
20. క్రిస్ జోర్డాన్- రూ. కోటి
21. బిల్లీ స్టాన్‌లేక్‌ - రూ.50 లక్షలు
22. తన్మయ్ అగర్వాల్‌ - రూ.20 లక్షలు
23. శ్రీవాత్స్ గోస్వామి- రూ. కోటి
24. బిపుల్ శర్మ - రూ.20 లక్షలు
25. మోహదీ హసన్‌ - రూ.20 లక్షలు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 17:21 [IST]
Other articles published on Jan 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+