Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: వేలంలో కోట్లు పలికే అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వీరే

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో ఇప్పటివరకు 578 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఇందులో ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టని ఆరుగురు ప్లేయర్లకు మాత్రం వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఆరుగురిలో కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న అండర్ 19 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డారు. వాళ్లలో ఇండియాకు చెందిన పృథ్వీ షా, శుభమాన్ గిల్, కమలేష్ నాగర్‌కోటి, రాహుల్ త్రిపాఠి కాగా, వెస్టిండిస్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు.

పృథ్వీ షా..... బ్యాట్స్ మెన్, ముంబై

పృథ్వీ షా..... బ్యాట్స్ మెన్, ముంబై

ప్రస్తుతం అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో హాఫ్ సెంచరీలతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రంజీ క్రికెట్‌లో ముంబై తరఫున తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో ఐదు సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 94 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ 2018లో పృథ్వీ షా అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.

 శుభమాన్ గిల్..... బ్యాట్స్‌మెన్, పంజాబ్

శుభమాన్ గిల్..... బ్యాట్స్‌మెన్, పంజాబ్

పంజాబ్ తరుపున తాను ఆడిన రెండు రంజీ మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. విజయ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జరిగిన అండర్-16 మ్యాచ్‌లో అరంగేట్రం మ్యాచ్‌లో గిల్ పంజాబ్ తరుపున డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు వరుసగా రెండుసార్లు బీసీసీఐ జూనియర్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో శుభమాన్ గిల్‌ను దక్కించుకునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ ఓ కన్నేసింది.

కమలేష్ నాగర్‌కోటి.... ఫాస్ట్ బౌలర్, రాజస్థాన్

కమలేష్ నాగర్‌కోటి.... ఫాస్ట్ బౌలర్, రాజస్థాన్

ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో తన పేస్‌బౌలింగ్‌తో కమలేష్ నాగర్‌కోటి ఆకట్టుకుంటున్నాడు. అండర్ 19 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగన మ్యాచ్‌లో 150 kph స్పీడ్‌తో బంతులు సంధించాడు. ముఖ్యంగా కమలేష్ నాగర్‌కోటి నిలకడకు మారు పేరు. అంతేకాదు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. రాజస్థాన్‌కు చెందిన కమలేష్ నాగర్‌కోటిపై రాజస్థాన్ రాయల్స్ జట్టు కన్నేసింది.

రాహుల్ త్రిపాఠి... బ్యాట్స్‌మెన్, మహారాష్ట్ర

రాహుల్ త్రిపాఠి... బ్యాట్స్‌మెన్, మహారాష్ట్ర

మహారాష్ట్రకు చెందిన రాహుల్ త్రిపాఠిని గతేడాది ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ రూ. 10 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. గతేడాది తన అద్భుత ప్రదర్శనతో ఆ జట్టుని ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 146 స్ట్రెక్‌ రేట్‌తో 391 పరుగులు చేశాడు. భారత్ తరుపున ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. దీంతో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వేలంలో ఉన్నాడు.

 రజనీష్ గుర్బానీ.... ఫాస్ట్ బౌలర్, విదర్భ

రజనీష్ గుర్బానీ.... ఫాస్ట్ బౌలర్, విదర్భ

2017-18 రంజీ క్రికెట్ విజేతగా విదర్భ నిలవడంలో రజనీష్ ముఖ్య పాత్ర పోషించాడు. 24 ఏళ్ల గుర్బానీ ఈ సీజన్‌లో మొత్తం 39 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. రజనీష్ గుర్బానీ (6/59)తో చెలరేగడంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే కుప్పకూలింది.

 జోఫ్రా ఆర్చర్... ఫాస్ట్ బౌలర్, వెస్టిండిస్

జోఫ్రా ఆర్చర్... ఫాస్ట్ బౌలర్, వెస్టిండిస్

వెస్టిండిస్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్ అండర్-19లో వెస్టిండిస్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించాడు. అయితే సీనియర్ లెవల్లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు తురుపున ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆర్చర్ పుట్టింది బార్బడోస్‌లో అయినా.. తండ్రి ఓ ఇంగ్లిష్ వ్యక్తి కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆర్చర్ ఇంగ్లీషు కౌంటీల్లో ఎసెక్స్ జట్టుకు ఆడుతున్నాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిస్తున్నాడు. అంతకుముందు బంగ్లా ప్రిమియర్ లీగ్‌లోనూ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.

Story first published: Tuesday, January 23, 2018, 15:14 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+