Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: వయస్సు పెరిగిందా..? ఫామ్ తగ్గిందా..? ప్రారంభ ధరకే పరిమితమైన సీనియర్లు

ipl auction 2018: senior cricketers disappointment

హైదరాబాద్: రిటెన్షన్ జాబితాలో అట్టిపెట్టుకోకుండా వేలానికి కొంతమంది సీనియర్లను అన్ని జట్లు వదిలేశాయి. అయితే పాత జట్ల చెల్లించిన ధరలు ప్రస్తుత ధరలకు ఏ మాత్రం పోలిక లేకుండా పోయింది సీనియర్ ప్లేయర్ల పరిస్థితి.

ఐపీఎల్ వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్‌-11 సీజన్‌ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్లకు ధరల విషయంలో తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ ధర పలకకున్నా, వారి స్థాయికి తగ్గట్లుగా రూ.4 నుంచి 5 కోట్ల వరకు ధర వస్తుందని కొందరు ఆటగాళ్లు భావించారు.

హర్భజన్‌ సింగ్, గౌతం గంభీర్, యువరాజ్‌ సింగ్‌లను పాత ఫ్రాంచైజీలు తీసుకోకపోవడంతో పాటు వారి కొత్త యాజమాన్యాలు కనీస ధరలకే కొనుగోలు కావడం గమనార్హం.

10 సీజన్లు ముంబై ఇండియన్స్‌కు ఆడిన హర్భజన్‌ సింగ్ ను చెన్నై సూపర్‌ కింగ్స్ 2 కోట్లకు, సన్‌రైజర్స్‌ స్టార్‌ ప్లేయర్‌ యువరాజ్‌ సింగ్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 2 కోట్లకు సొంతం చేసుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌ ట్రోఫీలు అందించిన గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 2.8 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది భారీ ధర ఉన్న అజింక్య రహానెను రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.

విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డుప్లెసిస్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.1.6 కోట్లకు, బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2 కోట్ల ధరకు తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఈ 11వ సీజన్లో చాలామంది సీనియర్ ఆటగాళ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే కొద్ది మందికి మాత్రం మునుపటి కంటే అనూహ్యంగా భారీ ప్యాకేజీలతోనే కొనుగోలు అవుతున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 27, 2018, 16:07 [IST]
Other articles published on Jan 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+