ఐపీఎల్ వేలం తొలిరోజు హైలెట్స్: రాహుల్, పాండే జాక్ పాట్... రషీద్ ఖాన్ చరిత్ర
హైదరాబాద్: ఐపీఎల్ 2018 తొలి రోజు వేలం ముగిసింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా వేదికగా ఈ వేలం ముగిసింది. వేలంలో వెయ్యికి పైగా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ బీసీసీఐ మాత్రం 578 ప్లేయర్లకు మాత్రమే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో తమకు నచ్చిన వారిని ప్రాంఛైజీలు పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశాయి.
తొలిరోజు మొత్తం 78 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం ప్రక్రియ ఆదివారం (జనవరి 28) కూడా జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుందని వేలం నిర్వహాకులు తెలిపారు.
ఐపీఎల్ వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అన్ క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు:
* అంకిత్ రాజ్‌పుత్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 3 కోట్లు
* నవదీప్ షైనీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 3 కోట్లు
* అనికేత్ చౌదరి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 30 లక్షలు
* అమ్ముడుపోని రజీనీష్ గుర్బానీ
* బసిల్ థంపి: సన్ రైజర్సై హైదరాబాద్ - రూ. 95 లక్షలు
* సిద్ధార్ద్ కౌల్: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 3.8 కోట్లు
కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి అడుగుపెట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో సిద్ధార్ద్ కౌల్ మెరుగైన ప్రదర్శన చేయడంతో పంజాబ్, హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 3.8 కోట్లకు సిద్ధార్ద్ కౌల్ ను సొంతం చేసుకుంది.
* కుల్వంత్ ఖేజ్రోలియా: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 85 లక్షలు
* అమ్ముడుపోని ప్రశాంత్ చోప్రా
* అమ్ముడుపోని షెల్డన్ జాక్సన్
* అమ్ముడుపోని విష్ణు వినోద్
* అమ్ముడుపోని అంకుశ్ బెయిన్స్
* అమ్ముడుపోని ఆదిత్య తారే
* అమ్ముడుపోని బెన్ మెక్డార్మెట్
* అమ్ముడుపోని నిఖిల్ నాయక్
* ఇషాన్ కిషన్: ముంబై ఇండియన్స్ - రూ. 6.2 కోట్లు
కనీస ధర రూ. 40 లక్షలతో వేలంలోకి వచ్చాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఇతడి కోసం ప్రాంఛైజీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇషాన్ కిషన్ కోసం బెంగళూరు, ముంబై జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే చివరకు వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 6.2 కోట్లకు సొంతం చేసుకుంది.
* అమ్ముడుపోని జితేశ్ శర్మ
* జోఫ్రా ఆర్చర్: రాజస్థాన్ రాయల్స్ - రూ. 7.2 కోట్లు
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న వెస్టిండిస్ ఆటగాడు జోఫ్రా అర్చర్‌పై ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆసక్తిని కనబర్చాయి. అతడి కోసం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 7.2 కోట్లకు సొంతం చేసుకుంది.
* నితీశ్ రాణా: కోల్ కతా నైట్ రైడర్స్ - రూ. 3.4 కోట్లు
* కృనాల్ పాండ్యా: ముంబై ఇండియన్స్ - రూ. 8.8 కోట్లు
ముంబై ఇండియన్స్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా కృనాల్ పాండ్యాను రూ. 8.8 కోట్లకు సొంతం చేసుకుంది.
* హర్షల్ పటేల్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 20 లక్షలు
* విజయ్ శంకర్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 3.2 కోట్లు
దీపక్ హుడ్డా: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 3.60 కోట్లు
దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన దీపక్ హుడ్డా కోసం బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన వద్ద ఉన్న రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా దీపక్ హుడ్డాని రూ. 3.6 కోట్లకు సొంతం చేసుకుంది.
రాహుల్ తెవాటియా: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 3 కోట్లు
అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్ల రౌండ్ జరుగుతుంది. రాహుల్ తెవాటియాను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది.
టీ విరామం:
* పృథ్వీ షా: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 1.2 కోట్లు
* అమ్ముడుపోని సిద్దేశ్ లాడ్
* మనన్ వోహ్రా: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.1.10 కోట్లు
* రాహుల్ త్రిపాఠి: రాజస్థాన్ రాయల్స్ - రూ. 3.4 కోట్లు
* అమ్ముడుపోని హిమంషు రాణా
* మయాంక్ అగర్వాల్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. కోటి
* రికీ భుయి: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 20 లక్షలు
* ఇషాంక్ జగ్గీ: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 20 లక్షలు
శుభమాన్ గిల్: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 1.8 కోట్లు
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో సత్తా చాటుతున్న యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 1.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
సూర్యకుమార్ యాదవ్: ముంబై ఇండియన్స్ - రూ. 3 కోట్లు
స్పిన్నర్ల రౌండ్ ముగిసింది. అన్ క్యాప్డ్ ప్లేయర్ల రౌండ్ ప్రారంభమైంది. తొలి బ్యాట్స్‌మెన్‌గా బ్యాగ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ పేరు వేలంలోకి వచ్చింది. కనీస ధర రూ. 30 లక్షలు. అయితే దేశవాళీ క్రికెట్‌లో సూర్యకుమార్ మంచి ఆటతీరుని కనబర్చడంపై ప్రాంఛైజీలు సూర్యకుమార్ యాదవ్ కోసం పోటీ పడ్డాయి. ఈ పోటీలో ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్‌ని రూ. 3 కోట్లకు దక్కించుకుంది.
కుల్దీప్ యాదవ్: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 5.80 కోట్లు
టీ20 స్పెషలిస్ట్ కుల్దీప్ యాదవ్ కోసం బెంగళూరు, పంజాబ్ జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకు రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రూ. 5.80 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్.
* అమ్ముడుపోని ఆడం జంపా
యజువేంద్ర చాహాల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 6 కోట్లు
ఈ ఏడాది టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసిన యజువేంద్ర చాహాల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రూ. 6 కోట్లకు కొనుగోలు చేసింది.
* అమిత్ మిశ్రా: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 4 కోట్లు
రషీద్ ఖాన్ కోసం తీవ్ర పోటీ: 9 కోట్లకు హైదరాబాద్ సొంతం
ఆప్ఘనిస్థాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ కోసం పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. వేలంలో రషీద్ ఖాన్ రూ. 9 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకోవాలని చూసింది. అయితే చివర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రషీద్ ఖాన్‌ను సొంతం చేసుకుంది. దీంతో పంజాబ్ సహా యజమాని ప్రీతిజింతా కాస్తంత అసహానానికి గురయ్యారు. ఆప్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇదొక గొప్ప రోజుగా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 19 ఏళ్ల రషీద్ ఖాన్ రూ. 9 కోట్లకు అమ్ముడుపోవడం నిజంగా అద్భుతమని అంటున్నారు.
* కర్ణ్ శర్మ: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 5 కోట్లు
* అమ్ముడుపోని ఇష్ సోథీ
* పియూష్ చావ్లా: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 4.20 కోట్లు
స్పిన్ బౌలర్ల రౌండ్ ప్రారంభమైంది. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పియూష్ చావ్లాను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 4.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
* అమ్ముడుపోని లసిత్ మలింగ
* కగిసో రబాడ: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 4.2 కోట్లు
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడను రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 4.2 కోట్లకు దక్కించుకుంది.
* అమ్ముడుపోని మిచెల్ మెక్లన్‌గన్
* మహమ్మద్ షమీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ - రూ. 3 కోట్లు
రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మహమ్మద్ షమీ రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది.
* అమ్ముడుపోని టిమ్ సౌథీ
* అమ్ముడుపోని ఇషాంత్ శర్మ
* ఉమేశ్ యాదవ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 4.20 కోట్లు
* ప్యాట్ కమ్మిన్స్: ముంబై ఇండియన్స్ - రూ. 5.4 కోట్లు
* అమ్ముడుపోని ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హెజల్‌ఉడ్
* అమ్ముడుపోని ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్
* ముస్తాఫిజుర్ రెహ్మాన్: ముంబై ఇండియన్స్ - రూ. 2.2 కోట్లు
దీంతో వికెట్ కీపర్ల రౌండ్ ముగిసింది. అనంతరం ఫాస్ట్ బౌలర్ల రౌండ్ ప్రారంభమైంది.
* జోస్ బట్లర్: రాజస్థాన్ రాయల్స్ - రూ. 4.4 కోట్లు
* అమ్ముడుపోని శామ్ బిల్లింగ్స్
గత ఐపీఎల్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన శామ్ బిల్లింగ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబరచలేదు.
* అంబటి రాయుడు: చెన్నై సూపర్ సింగ్స్ - రూ. 2.2 కోట్లు
తెలుగు తేజం అంబటి రాయుడు కోసం ఐపీఎల్ వేలంలో ప్రాంఛైజీలు బాగానే ఆసక్తికనబరిచాయి. రాయుడుని దక్కించుకునేందుకు గాను ముంబై, రాజస్థాన్, చెన్నై జట్లు పడ్డాయి. అయితే చివరకు చెన్నై జట్టు రూ. 2.2 కోట్లు వెచ్చించి అంబటి రాయుడుని దక్కించుకుంది.
జాక్‌పాట్ కొట్టిన సంజూ శాంసన్ - రాజస్థాన్ రాయల్స్ (రూ. 8 కోట్లు)
కేరళ యువ ఆటగాడు సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 8 కోట్లు వెచ్చించి తీవ్ర పోటీ మధ్య కొనుగోలు చేసింది.
* రాబిన్ ఊతప్ప: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 6.4 కోట్లు
వేలంలో రాబిన్ ఊతప్ప కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రాబిన్ ఊతప్పను రూ. 6.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
* అమ్ముడుపోని నమన్ ఓజా
దినేశ్ కార్తీక్ కోసం తీవ్ర పోటీ: కోల్ కతా నైట్ రైడర్స్ - రూ. 7.40 కోట్లు
టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్ కోసం కోల్‌కతా, ముంబై, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీలో చివరకు కోల్‌కతా జట్టు దినేశ్ కార్తీక్‌ను రూ. 7.40 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసింది.
* అమ్ముడుపోని ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో
* వృద్ధిమాన్ సాహా - సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 5 కోట్లు
* క్వంటన్ డీ కాక్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 2.8 కోట్లు
అమ్ముడుపోని పార్దీవ్ పటేల్
లంచ్ విరామం అనంతరం ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఈ రౌండ్‌లో ప్రాంఛైజీలు వికెట్ కీపర్లను కొనుగోలు చేయనున్నాయి. మొట్టమొదటి వికెట్ కీపర్‌గా పార్దీవ్ పటేల్ కనీస ధర రూ. 1 కోటిగా వేలంలో నిలిచాడు. అయితే పార్దీవ్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు.
ఐపీఎల్ వేలం మార్నింగ్ సెషన్ పూర్తి అయింది. లంచ్ విరామం ప్రకటించారు. తిరిగి మధ్యాహ్నాం 2 గంటల తర్వాత వేలం ప్రారంభం అవుతుంది.
ఒక్కో జట్టు వద్ద మిగిలి ఉన్న బడ్జెట్:
CSK - Rs 25.2 cr
DD - Rs 31.8 cr
KXIP - Rs 25.9 cr
KKR - Rs 40 cr
MI - Rs 41.6 cr
RR - Rs 50.5 cr
RCB - RS 34.1 cr
SRH - Rs 33.9 cr
మార్నింగ్ సెషన్‌లో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు:
Ben Stokes (RR) - Rs 12.5 cr
RL Rahul (KXIP) - Rs 11 cr
Manish Pandey (SRH) - Rs 11 cr
Chris Lynn (KKR) - Rs 9.6 cr
Mitchell Starc (KKR) - Rs 9.4 cr
Glenn Maxwell (DD) - Rs 9 cr
* మొయిన్ అలీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 1.70 కోట్లు
* మార్కస్ స్టోయినిస్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 6.20 కోట్లు
ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ కోసం బెంగళూరు, పంజాబ్ జట్లు తలపడ్డాయి. అయితే పంజాబ్ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రూ. 6.20 కోట్లకు మార్కస్ స్టోయినిస్‌ను దక్కించుకుంది.
* స్టువర్ట్ బిన్నీ: రాజస్థాన్ రాయల్స్ - రూ. 50 లక్షలు
రూ. 1.90 లక్షలకు కోలిన్ మున్రోని దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్
రూ. 1.90 లక్షలకు యూసఫ్ పఠాన్‌ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
అమ్ముడుపోని జేమ్స్ ఫల్కనర్
కోలిన్ డీ గ్రాండ్‌హోమ్‌ను రూ. 2.2 కోట్లకు కోనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రూ. 7.8 కోట్లకు కేదార్ జాదవ్‌ను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నైకి షేన్ వాట్సన్
కనీస ధర రూ. 1కోటితో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు వేలానికి వచ్చాడు. వాట్సన్ కోసం చెన్నై, బెంగళూరు, ఢిల్లీ జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకు చెన్నై రూ. 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
రూ. 2 కోట్లకు కార్లోస్ బ్రాత్ వైట్‌ను దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
రూ. 7.4 కోట్లు పెట్టి క్రిస్ వోక్స్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు
ప్రారంభమైన నాలుగో రౌండ్
నాలుగో రౌండ్ ప్రారంభమైంది. నాలుగో రౌండ్‌లో ప్రాంఛైజీలు ఆల్ రౌండర్లను కొనుగోలు చేయనున్నాయి. ఆల్ రౌండర్లలో తొలి ప్లేయర్‌గా ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ పేరు బ్యాగ్ నుంచి తీశారు. క్రిస్ వోక్స్ కోసం చెన్నై రూ. 2 కోట్లకు బిడ్ వేసినప్పటికీ చివరకు బెంగళూరు రూ. 7.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
అమ్ముడుపోని న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్. దీంతో మూడో సెట్ ప్లేయర్ల వేలం ముగిసింది. ఐదు నిమిషాల బ్రేక్.
మనీష్ పాండే కోసం పోటా పోటీ, చివరకు హైదరాబాద్ సొంతం
కనీస ధర రూ.1 కోటితో వేలానికి వచ్చాడు. అయితే పాండే కోసం పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. నిజానికి పాండే కోల్‌కతాకు చెందిన ఆటగాడు అయినప్పటికీ, ఆ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించలేదు. చివరకు హైదరాబాద్ జట్టు రూ. 11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే పాండే కోసం ప్రాంఛైజీలు ఇంత పెద్ద మొత్తం వెచ్చించడం గనుక ఈ ఏడాది అతడు అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించడమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
అమ్ముడుపోని హషీం ఆమ్లా
రూ. 9.6 కోట్లు పలికిన క్రిస్ లిన్
వేలంలో కనీస ధర రూ. 2కోట్ల నుంచి రూ. 9.6 కోట్ల వరకు పలికాడు. ముఖ్యంగా క్రిస్ లిన్ కోసం బెంగళూరు, పంజాబ్, కోల్‌కతా జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకు వేలంలో రూ. 9.6 కోట్లకు క్రిస్ లిన్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది.
తక్కువ ధరకే జాసన్ రాయ్‌ను దక్కించుకున్న ఢిల్లీ
ఐపీఎల్ వేలంలో జాసన్ రాయ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది.
రూ. 3.6 కోట్లకు మెక్‌కల్లమ్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు
న్యూజిలాండ్ విధ్వంసకర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 3.6 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆరోన్ ఫించ్: రూ 1.5 కోట్ల నుంచి రూ. 6.20 కోట్లకు
ఆస్ట్రేలియా టీ20 స్పెషలిస్ట్ ఆరోన్ ఫించ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 6.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఫించ్ కోసం పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ చివరకు పంజాబ్ సొంతం చేసుకుంది.
రూ. 3 కోట్లకు డేవిడ్ మిల్లర్‌ను సొంతం చేసుకున్న పంజాబ్
రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా డేవిడ్ మిల్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది.
అమ్ముడుపోని మురళీ విజయ్
రూ. 11 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్ కొనుగోలు చేసిన పంజాబ్
టీమిండియా టెస్టు ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను వేలంలో రూ. 11 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు కోనుగోలు చేసింది.
నాయర్ జాక్‌పాట్: 50 లక్షల నుంచి
ఐపీఎల్ 2018 వేలంలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ జాక్ పాట్ కొట్టాడు. కనీస ధర రూ. 50 లక్షల నుంచి మొదలైన కరుణ్ నాయర్ కోసం పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడ్డాయి. చివరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా కరుణ్ నాయర్‌ను రూ. 5.6 కోట్లకు దక్కించుకుంది.
రూ. 2 కోట్లకు యువీని సొంతం చేసుకున్న పంజాబ్
టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను వేలంలో రూ. 2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోనుగోలు చేసింది. ఐపీఎల్ వేలానికి ముందు పంజాబ్ డైరెక్టర్ యువీతో పాటు భజ్జీని కోనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వేలంలో భజ్జీని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోవడం విశేషం.
వేలంలో అమ్ముడుపోని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్
హైదరాబాద్‌కే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
వేలంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 3 కోట్లకు కోనుగోలు చేసింది.
డ్వేన్ బ్రావో కోసం రైట్ టు మ్యాచ్ కార్డు వాడిన చెన్నై
విండిస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కోసం చెన్నై జట్టు రైట్ టు మ్యాచ్ కార్డు వాడి రూ. 6.4 కోట్లకు కోనుగోలు చేసింది.
ఎట్టకేలకు ఢిల్లీ జట్టులో గంభీర్
ఐపీఎల్ 2018లో ఢిల్లీ జట్టుకు ఆడాలన్న గౌతమ్ గంభీర్ కోరిక నెరవేరనుంది. శనివారం జరిగిన వేలంలో గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. 2.8 కోట్లకు కోనుగోలు చేసింది.
మ్యాక్స్‌వెల్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ
ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే పంజాబ్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డుని ఉపయోగించలేదు. దీంతో మ్యాక్స్‌వెల్‌ను రూ. 9 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకుంది.
హైదరాబాద్‌కు బంగ్లా క్రికెటర్ షకీబ్ ఉల్ హాసన్
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 2 కోట్లు పెట్టి కోనుగోలు చేసింది.
భజ్జీ కోసం రూ. 2 కోట్లు
టీమిండియా వెటరన్ క్రికెట్ హర్భజన్ సింగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
ఇప్పటివరకు వేలంలో అమ్ముడుబోయిన ఆటగాళ్లు వీరే:
Shikhar (Rs 7.2 cr RTM Hyderabad), Ashwin (Rs 7.6 cr Punjab), Pollard (Rs 5.4 cr RTM Mumbai), Stokes (Rs 12.5 cr Rajasthan), Du Plessis (Rs 1.6 cr RTM Chennai), Rahane (Rs 4 cr RTM Rajasthan), Starc (Rs 9.4 cr Kolkata)

తొలి సెట్ కీలక ఆటగాళ్ల వేలం పూర్తి: 15 నిమిషాలు బ్రేక్
తొలి సెట్ కీలక ఆటగాళ్ల వేలం పూర్తి అయింది. ఈ సెట్‌లో విదేశీ ఆటగాళ్లు అత్యధిక ధర పలికారు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.5 కోట్లు ఖర్చు పెట్టగా, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్ కోసం కోల్‌కతా జట్టు రూ. 9.4 కోట్లు ఖర్చుపెట్టింది.
రూ. 9.4 కోట్లకు మిచెల్ స్టార్క్‌ని సొంతం చేసుకున్న కోల్‌కతా
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కోసం కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే చివరకు కోల్‌కతా రూ. 9.4 కోట్లు వెచ్చించి కోల్‌కతా స్టార్క్‌ను సొంతం చేసుకుంది.
రహానే కోసం రూ. 4 కోట్లు ఖర్చుపెట్టిన రాజస్థాన్
టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డుని ఉపయోగించింది. వేలంలో రూ. 4 కోట్లు పెట్టి రహానేను సొంతం చేసుకుంది.
డుప్లెసిస్‌ను కొనుగోలు చేసిన చెన్నై
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 1.60 కోట్లకు వేలంలో దక్కించుకుంది.
బెన్ స్టోక్స్ కోసం పోటాపోటీ: చివరకు రాజస్థాన్‌కు
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ కోసం అన్ని ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. అయితే చివరకు రూ. 12.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో బెన్ స్టోక్స్ రూ. 14.5 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.
ముంబైకే పొలార్డ్
వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్‌ను ఐపీఎల్ 2018 వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. పొలార్డ్ కోసం తీవ్ర నెలకొన్న సమయంలో రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రూ. 5.4 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.
అశ్విన్‌ను సొంతం చేసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్
టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోసం చెన్నై, పంజాబ్ జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది. అయితే చివరకు రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 7.6 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోనుగోలు చేసింది.
హైదరాబాద్‌కే శిఖర్ ధావన్:
2018 వేలంలో తొలి ప్లేయర్ శిఖర్ ధావన్ నిలిచాడు. శిఖర్ ధావన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు INR 520 lacsకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ
అందరికీ స్వాగతం. ఈ ఈవెంట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాం. ఇదొక గొప్ప వేలం. 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక్కడ ఎంతో మంది ఫ్యామిలీ ముఖాలను చూస్తున్నాను. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు స్వాగతం. 1100కి పైగా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే అందులో 580 మందికి మాత్రమే అనుమతి లభించింది. దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. మంచి ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయండి.

వ్యూహ ప్రతివ్యూహాలతో బరిలోకి దిగిన ఫ్రాంఛైజీలు
తమ అభిమాన ఆటగాడు ఏ జట్టు సొంతం అవుతాడో, తమ అభిమాన జట్టు కొత్త స్వరూపం ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన అభిమానులను ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా పూర్తి స్థాయిలో జట్టును ఎంచుకోవాల్సి ఉండటంతో నాణ్యమైన, మేటి ఆటగాళ్లను చేజిక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో బరిలో దిగనున్నాయి.
తాజా విధివిధానాల ప్రకారం ప్రతీ జట్టు ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను (రిటెయిన్+ఆర్‌టీఎమ్) ద్వారా అట్టిపెట్టుకోవచ్చు. దీనిప్రకారం ఇప్పటికే 18 మంది ఆటగాళ్లను ఆయా జట్లు అట్టిపెట్టుకోవడంతో మిగతా 182 స్థానాల కోసం బెంగళూరు వేదికగా వేలం జరుగనుంది.
ఈ వేలంలో భారత్ నుంచి 361 మంది వేలంలో పాల్గొననున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన 25 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ప్రతీ జట్టుకు రూ. 80 కోట్లను బడ్జెట్‌గా కేటాయించారు. దీనిలో కొంత ప్లేయర్ రిటెయిన్ పాలసీ ద్వారా ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి.

ప్రతీజట్టు గరిష్టంగా 25 మందిని, కనిష్టంగా 18 మంది
ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక జట్టులో కేవలం 8 మంది విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. ప్లేయర్ రిటెన్షన్ ఈవెంట్ తర్వాత ఫ్రాంచైజీల వద్ద మిగిలిన బడ్జెట్:
* చెన్నై సూపర్ కింగ్స్: రూ. 47 కోట్లు. (ధోని, రైనా, జడేజా)
* ఢిల్లీ డేర్ డెవిల్స్: రూ. 47 కోట్లు (శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, క్రిస్ మోరిస్)
* కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 59 కోట్లు (రసెల్, సునీల్ నరైన్)
* కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రూ. 67.5 కోట్లు (అక్షర్ పటేల్)
* ముంబై ఇండియన్స్: రూ. 47 కోట్లు (రోహిత్, హార్దిక్, బుమ్రా)
* రాజస్తాన్ రాయల్స్: రూ. 67.5 కోట్లు (స్టీవ్ స్మిత్)
* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 49 కోట్లు (కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, డివిలియర్స్)
* సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 59 కోట్లు (వార్నర్, భువనేశ్వర్)
వేలంలో కీలకఆటగాళ్లు (16):
Ravichandran Ashwin, Shikhar Dhawan, Chris Gayle, Kieron Pollard, Ajinkya Rahane, Mitchell Starc, Ben Stokes, Dwayne Bravo, Gautam Gambhir, Glenn Maxwell, Harbhajan Singh, Yuvraj Singh (All Rs 2 crore base price)
Faf du Plessis, Joe Root, Kane Williamson (All Rs 1.5 crore base price)
Shakib Al Hasan (Rs 1 crore base price)
ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీరే:
CSK - MS Dhoni (Rs 15 crore), Suresh Raina (Rs 11 crore), Ravindra Jadeja (Rs 7 crore)
DD - Rishabh Pant (Rs 15 crore), Chris Morris (Rs 11 crore), Shreyas Iyer (Rs 7 crore)
KXIP - Axar Patel (Rs 12.5 crore)
KKR - Sunil Narine (Rs 12.5 crore), Andre Russell (Rs 8.5 crore)
MI - Rohit Sharma (Rs 15 crore), Hardik Pandya (Rs 11 crore), Jasprit Bumrah (Rs 7 crore)
RR - Steve Smith (Rs 12.5 crore)
RCB - Virat Kohli (Rs 17 crore), AB de Villiers (Rs 11 crore), Sarfaraz Khan (Rs 3 crore)
SRH - David Warner (Rs 12.5 crore), Bhuvneshwar Kumar (Rs 8.5 crore)
ఉదయం 10.00 గంటల నుంచి
ఉదయం 10.00 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications