న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం: చివరి వరకు క్రిస్‌గేల్‌ను తీసుకోకపోవడానికి కారణం ఇదే

హైదరాబాద్: విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అని పేరు తెచ్చుకున్న క్రిస్ గేల్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి కనబరచలేదు.అంతకుముందు ఐపీఎల్ సీజన్లో విఫలమవ్వడమే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. ఫామ్‌లేమి, పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. చివరికి ప్రీతి జింతా కనికరించడంతో ఐపీఎల్లో ఆడేందుకు పంజాబ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదీ ప్రారంభ ధర 2 రూ. కోట్లకే.

 రాజస్థాన్ రాయల్స్ పట్టించుకోలేదు:

రాజస్థాన్ రాయల్స్ పట్టించుకోలేదు:

ఇప్పటికే ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటి స్థానానికి పోటీ పడుతుంది. జట్టులో ఉన్న స్టార్ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ టైటిల్‌ ఫేవరెట్ల జాబితా నుంచి నిష్క్రమించడం అటు యాజమాన్యంతో పాటూ ఇటు అభిమానులనూ తీవ్ర నిరాశకు గురిచేసింది.

 కేవలం 200 పరుగులే:

కేవలం 200 పరుగులే:

తాజా వేలంలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సీబీ క్రేజ్‌ కన్నా సత్తా ఉన్న ఆటగాళ్ల వైపే మొగ్గు చూపింది. ఐపీఎల్‌ -7లో 9 మ్యాచ్‌లాడిన గేల్‌ కేవలం 200 పరుగులే చేశాడు. అయితే మొన్నీ మధ్య ఎలాంటి ఆదరణ లేకుండా సాగిన బంగ్లాదేశ్‌ ప్రిమియల్‌ లీగ్‌ను ఓ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముగించాడు గేల్‌.

వివాదాలు:

వివాదాలు:

ప్రస్తుతం గేల్‌ వయస్సు 38 సంవత్సరాలు. మైదానంలో చురుగ్గా కదలడానికి, వికెట్ల మధ్య పరుగులు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపడు. క్షణాల్లో ఫలితం మారిపోయే పొట్టి క్రికెట్లో చాలా చురుగ్గా, వ్యూహాత్మకంగా ఆడాలి. గేల్‌ ఇందుకు పూర్తి భిన్నం. బ్యాటింగ్‌ విషయంలో స్పిన్నర్ల బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన దాఖలాలు లేవు.

మైదానంలో ఉన్నంతసేపు చిందులే:

మైదానంలో ఉన్నంతసేపు చిందులే:

బిగ్‌బాష్‌ లీగ్‌లో ఓ యాంకర్‌తో అసభ్యంగా వ్యవహరించి అంతర్జాతీయ మీడియాలో గేల్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు. తనను ఇంటర్య్వూ చేయడానికి వచ్చిన మహిళా టీవీ యాంకర్లతో హద్దుమీరి ప్రవర్తించడం అతనికి పరిపాటిగా మారడం ఓ కారణమే. తన వైవిధ్య శైలి, డ్యాన్స్‌ వంటి హంగామాలతో మైదానంలో ఉన్నంతసేపు అభిమానులను అలరిస్తాడు.

 ముందుకు రాలేదు:

ముందుకు రాలేదు:

ట్వంటీ 20 స్పెషలిస్టులుగా ముద్రపడిన క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌), మార్టిన్‌ గప్టిల్‌(న్యూజిలాండ్‌)లకు ఐపీఎల్‌-11 వేలంలో మరోసారి చుక్కెదురైంది. శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఈ ఇద్దరి క్రికెటర్లు.. ఆదివారం కొనసాగుతున్న వేలంలో కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ స్టార్‌ క్రికెటర్ల వైపు కనీసం ఏ ఫ్రాంచైజీ కన్నెత్తికూడా చూడకపోవడం గమనార్హం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 16:54 [IST]
Other articles published on Jan 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X