ఐపీఎల్: ఐపీఎల్‌ని కాదు వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకోండి

హైదరాబాద్: టీమిండియా అండర్ 19 జట్టు రాహుల్ ద్రవిడ్ కోచ్ నేతృత్వంలో దూసుకుపోతోంది. ఇదిలా ఉంచితే అండర్ 19 జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ వేలం మీదకు ధ్యాస మళ్లిందట. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఇలా ఐపీఎల్ గురించి ఆలోచించొద్దని ద్రవిడ్ వారికి గుర్తు చేస్తున్నాడు.
అండర్ 19 క్రికెటర్లైన పృథ్వీ షా, శుబ్మమ్ గిల్, హిమన్షు రానా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, కమలేశ్ నాగర్‌కోరి, శివం మావి, అర్ష్‌దీప్ సింగ్, హర్విక్ దేశాయ్‌లు ఐపీఎల్ వేలానికి అర్హత సాధించారు. దీంతో ఇక వారు ధ్యాసంతా ఐపీఎల్ పైనే కొనసాగుతుండటంతో ద్రవిడ్ వారికి హితబోధ చేసేందుకు పూనుకున్నాడు.
'మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. లక్ష్యం ఏమిటో, దేని కోసం పోరాడాలనుకున్నామో, కానీ ఇప్పడు మీ వైఖరి అలా లేదు. చిన్న చిన్న లక్ష్యాల కోసం ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఐపీఎల్ వేలం యేటా వస్తూనే ఉంటుంది. కానీ, వరల్డ్ కప్‌లో ఆడేందుకు మాత్రం అవకాశం అలా రాదు. నేను మీరు ఇక్కడ బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారని ఆశిస్తున్నాను.' అని కుర్రాళ్లకు వివరించాడు.
'మనం ఇంతకుముందే వేలాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇంతటితో ఈ ఆలోచనని కాసేపు పక్కన పెడదాం. గతం గురించి ఆలోచించకుండా బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉన్న మ్యాచ్ గురించి ప్రయత్నిద్దాం. ఇలానే ఒకసారి మనం బంగ్లాదేశ్‌తో ఆసియా కప్‌లో ఓడిపోయాం. బంగ్లాదేశ్ జట్టు స్థాయి ఏంటో మనకి తెలుసు. దాన్ని తక్కువ అంచనా వేయకూడదంటూ' భారత జట్టుకు ధైర్యాన్ని నూరిపోశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Thursday, January 25, 2018, 17:03 [IST]
Other articles published on Jan 25, 2018
Read in English: IPL: Dravid urges U19 boys to focus
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications