For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముగిసిన ఐపీఎల్ వేలం, హైలెట్స్: చివర్లో క్రిస్‌గేల్ లక్కీ, నేపాల్ నుంచి ఒక్కడు

By Nageshwara Rao
 IPL Auction 2018 Day 2 LIVE: Fringe players in focus as teams eye balance

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ముగిసింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ వేదికగా ఈ వేలం రెండు రోజుల పాటు జరిగింది. ఈ వేలంలో మొత్తం 578 మంది క్రికెటర్లకు బీసీసీఐ అనుమతిచ్చింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలంలో మొత్తం 169 మంది క్రికెటర్లు అమ్ముడుపోయారు.

ఇందులో 56 మంద విదేశీ అటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో కోసం 8 ప్రాంఛైజీలు మొత్తం రూ. 4,31,70,00,000 కోట్లను ఖర్చు చేశాయి. వేలంలో భాగంగా జరిగిన చివరి రౌండ్ ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. టీ20 స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్‌ను చివరి రౌండ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కనీస ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు శ్రీలంకకు చెందిన దుష్మంత చమీరాను రాజస్థాన్ రాయల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. రెండో రోజు వేలంలో నేపాల్‌కు చెందిన యువ క్రికెటర్ సందీప్‌ లామిచానెను ఢిల్లీ డేర్ డెవిల్స్ కనీస ధర రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్‌లో కాంట్రాక్టు దక్కించుకున్న నేపాల్‌ తొలి క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.

17 ఏళ్ల ఈ లెగ్‌ స్పిన్నర్‌ ‌2016 అండర్‌-19 వరల్డ్ కప్‌లో తన సంచలన బౌలింగ్‌తో నేపాల్‌ను ఎనిమిదో స్థానంలో నిలిపాడు. ఆరు ఇన్నింగ్సుల్లో 17 యావరేజితో 4.67 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ అంటే అతడికి ఎంతో ఇష్టం.

వేలంలో భాగంగా చివరి రౌండ్‌లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు:

* జవోన్ సీర్లెస్: కోల్ కతా నైట్ రైడర్స్ - రూ. 30 లక్షలు
* మంజూర్ దర్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 20 లక్షలు
* నిధీష్ MD దినేషన్: ముంబై ఇండియన్స్ - రూ. 20 లక్షలు
* దుష్మంత చమీరా: రాజస్థాన్ రాయల్స్ - రూ. 50 లక్షలు
* క్రిస్ గేల్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 2 కోట్లు


* పవన్ దేశ్ పాండే: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 20 లక్షలు

* ఆర్యమన్ విక్రమ్ బిర్లా: రాజస్థాన్ రాయల్స్ - రూ. 30 లక్షలు

* జతిన్ సక్సేనా: రాజస్థాన్ రాయల్స్ - రూ. 20 లక్షలు
* చైతన్య బిష్ణోయి: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 20 లక్షలు
* మోను సింగ్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 20 లక్షలు
* క్షిర్తిజ్ శర్మ: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 20 లక్షలు
* మెహిదీ హాసన్: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 20 లక్షలు
* మోషిన్ ఖాన్: ముంబై ఇండియన్స్ - రూ. 20 లక్షలు
* మహిపాల్ లోమ్‌రోర్: రాజస్థాన్ రాయల్స్ - రూ. 20 లక్షలు

* మార్క్ ఉడ్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 1.5 కోట్లు
* అనుకుల్ రాయ్: ముంబై ఇండియన్స్ - రూ. 20 లక్షలు
* మయాంక్ దగార్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 20 లక్షలు
* ప్రదీప్ సాహు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 20 లక్షలు

* అఖిల ధనుంజయ: ముంబై ఇండియన్స్ - రూ. 50 లక్షలు
* బెన్ లాగ్లిన్: రాజస్థాన్ రాయల్స్: రూ. 50 లక్షలు

* మయాంక్ మార్కండే: ముంబై ఇండియన్స్ - రూ. 20 లక్షలు
* సయాన్ ఘోష్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 20 లక్షలు
* బిపుల్ శర్మ: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 20 లక్షలు

* ఆదిత్య తారే: ముంబై ఇండియన్స్ - రూ. 20 లక్షలు
* ప్రశాంత్ చోప్రా: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 20 లక్షలు
* సిద్దేశ్ లాడ్: ముంబై ఇండియన్స్ - రూ. 20 లక్షలు
* అమ్ముడుపోని ఇష్ సోథీ
* టిమ్ సౌథీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. కోటి
* మిచెల్ జాన్సన్: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 2 కోట్లు
* పార్దీవ్ పటేల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 1.7 కోట్లు
* నోమన్ ఓజా: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 1.4 కోట్లు
* శ్యామ్ బిల్లింగ్స్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. కోటి
* మురళీ విజయ్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 2 కోట్లు
* అమ్ముడుపోని క్రిస్ గేల్
లంచ్ విరామం అనంతరం వేలం ప్రారంభమైంది.


రెండో రోజైన ఆదివారం ఐపీఎల్ వేలానికి లంచ్ విరామం ప్రకటించారు. విరామం అనంతరం తిరిగి వేలం మొదలవుతుంది. తొలిరోజు వేలంలో అమ్ముడుపోని క్రిస్ గేల్, లసిత్ మలింగ, హషీం ఆమ్లా, మురళీ విజయ్‌లు లంచ్ విరామం అనంతరం జరిగే వేలంలోనైనా అమ్ముడుపోతారో లేదో చూద్దాం.

* MS మిధున్: రాజస్థాన్ రాయల్స్ - రూ. 20 లక్షలు
* అనిరుధ జోషీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 20 లక్షలు
* ధ్రువ్ షోరేయ్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 20 లక్షలు
* కనిష్ సేథ్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 20 లక్షలు
* శరద్ లుంబా: ముంబై ఇండియన్స్ - రూ. 20 లక్షలు
* లుంగిడి ఎంగ్డి: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 50 లక్షలు

* సందీప్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 20 లక్షలు
* ఆసిఫ్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 40 లక్షలు
* బెన్ డార్విస్విస్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 1.4 కోట్లు

* శ్రీవాత్సవ్ గోస్వామి: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. కోటి

* అక్షదీప్ నాథ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. కోటి
* శ్రేయాస్ గోపాల్: రాజస్థాన్ రాయల్స్ - రూ. 20 లక్షలు
* తాజిందర్ ధిల్లాన్: ముంబై ఇండియన్స్ - రూ. 55 లక్షలు
* కామెరూన్ డెల్‌ఫోర్ట్: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 30 లక్షలు
* దీపక్ చహర్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 80 లక్షలు
* తన్మయ్ అగర్వాల్: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 20 లక్షలు

* ఆండ్రూ టై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 7.2 కోట్లు
* బిల్లీ స్టాన్‌లేక్: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 50 లక్షలు

* బిల్లీ స్టాన్‌లేక్: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 50 లక్షలు
* బరీందర్ శ్రాణ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 2.2 కోట్లు

* అమ్ముడుపోని తైమాల్ మిల్స్
గతేడాది వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది వేలంలో ఏ ప్రాంఛైజీ కూడా తైమాల్ మిల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు.
* అమ్ముడుపోని బెన్ లాఫ్లిన్

* జేసన్ బెహ్రాన్‌డార్ఫ్: ముంబై ఇండియన్స్ - రూ. 1.5 కోట్లు
* అమ్ముడుపోని శ్రీనాథ్ అరవింద్
* అమ్ముడుపోని వరుణ్ ఆరోన్
* అమ్ముడుపోని ల్యూక్ రోంచీ
* అమ్ముడుపోని కుశాల్ పెరీరా
* అమ్ముడుపోని డేవిల్ బిల్లీ
* మిచెల్ సట్నర్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 50 లక్షలు
* క్రిస్ జోర్డాన్: సన్ రైజర్స్ హైదరాబాద్- రూ. కోటి
* జేపీ డుమిని: ముంబై ఇండియన్స్ - రూ. కోటి
* జహీర్ ఖాన్: రాజస్థాన్ రాయల్స్ - రూ. 60 లక్షలు
* జగదీశ్ నారాయణన్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 20 లక్షలు
* అమ్ముడుపోని ఛార్లెస్ జాన్సన్


అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్లు:

* అమ్ముడుపోని నాథూ సింగ్
* అనిరుథ్ సింగ్ కథురియా: రాజస్థాన్ రాయల్స్ - రూ. 30 లక్షలు
* ప్రదీప్ సాంగ్వాన్: ముంబై ఇండియన్స్ - రూ. 1.5 కోట్లు

* అమ్ముడుపోని సయాన్ ఘోష్
* అమ్ముడుపోని ఈశ్వర్ పాండే

* అమ్ముడుపోని స్వప్నిల్ సింగ్
* అమ్ముడుపోని బిపుల్ శర్మ
* అభిషేక్ శర్మ: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 55 లక్షలు

* అమ్ముడుపోని ప్రవీణ్ దుబే
* శివమ్ మావి: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 3 కోట్లు
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న శివమ్ మావిపై ఫ్రాంచైజీలు ఆసక్తిని కనబర్చాయి. మావి కోసం ముంబై, కోల్‌కతా జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 3 కోట్లకు శివమ్ మావిని సొంతం చేసుకుంది.
* అంకిత్ శర్మ: రాజస్థాన్ రాయల్స్ - రూ. 20 లక్షలు


* మన్జోత్ కల్రా: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 20 లక్షలు
* సచిన్ బేబీ: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 20 లక్షలు
* రింకు సింగ్: కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 80 లక్షలు

* అపూర్వ వాంఖడే: కోల్ కతా నైట్ రైడర్స్ - రూ. 20 లక్షలు
* అమ్ముడుపోని అన్మోల్ ప్రీత్ సింగ్
* అమ్ముడుపోని టాబ్రిజ్డ్ షంసీ
* అమ్ముడుపోని ప్రజ్ఞాన్ ఓజా
* అమ్ముడుపోని ఫవేద్ అహ్మద్
* అమ్ముడుపోని నాథన్ లయన్
* ముజీబ్ జర్డాన్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 4 కోట్లు
ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ముజీబ్ జర్డాన్ ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ తర్వాత ఐపీఎల్‌లో ఆడనున్న మూడో ఆటగాడిగా నిలిచాడు.


రెండో రోజు వేలంలో భాగంగా మార్నింగ్ సెషన్ ముగిసింది. ఆదివారం జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా జయదేవ్ ఉనదఖ్త్ చరిత్ర సృష్టించాడు. జయదేవ్ ఉనదఖ్త్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 11.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

ఈ ఏడాది వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు:
* జయదేవ్ ఉనదఖ్త్ - రూ. 11.5 కోట్లు (RR)
* కేఎల్ రాహుల్ - రూ. 11 crore (KXIP)
* మనీష్ పాండే - రూ. 11 crore (SRH)


క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు:

* అమ్ముడుపోని డేల్ స్టెయిన్
* శార్దూల్ ఠాకూర్: చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 2.6 కోట్లు

* ట్రెంట్ బౌల్ట్: ఢిల్లీ డేర్‌డెవిల్స్ - రూ. 2.2 కోట్లు

* జయదేవ్ ఉనదఖ్త్: రాజస్తాన్ రాయల్స్ - రూ. 11.5 కోట్లు

ఐపీఎల్ 2018 వేలంలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా జయదేవ్ ఉనదఖ్త్ నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో జయదేవ్ ఉనదఖ్త్ కోసం చెన్నై, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 11.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.

* నాథన్ కౌల్టర్-నైల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 2.2 కోట్లు
* మహమ్మద్ సిరాజ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 2.6 కోట్లు
* వినయ్ కుమార్: కోల్ కతా నైట్ రైడర్స్ - రూ. కోటి

* సందీప్ శర్మ: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. 3 కోట్లు

* మోహిత్ శర్మ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. 2.4 కోట్లు [RTM]
* ధావల్ కులకర్ణి: రాజస్థాన్ రాయల్స్ - రూ. 75 లక్షలు [RTM]


అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్లు:

* అమ్ముడుపోని రిషి ధావన్
* మహమ్మద్ నబీ: సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ. కోటి
* బెన్ కటింగ్: ముంబై ఇండియన్స్ - రూ. 2.2 కోట్లు
* అమ్ముడుపోని మోసిస్ హెన్రీక్యూస్
* అమ్ముడుపోని కోరీ ఆండర్సన్
* గురుకీత్ మన్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 75 లక్షలు
* జయంత్ యాదవ్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 50 లక్షలు
* డేనియల్ క్రిస్టెన్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 1.5 కోట్లు


* పవన్ నేగి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. కోటి [RTM]
* వాషింగ్టన్ సుందర్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 3.2 కోట్లు

అన్ క్యాప్డ్ స్పిన్నర్లు:

* మనోజ్ తివారీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రూ. కోటి
* అమ్ముడుపోని కొలిన్ ఇన్గ్రామ్
* అమ్ముడుపోని ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్
* మన్దీప్ సింగ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 1.4 కోట్లు
* అమ్ముడుపోని లెండిల్ సిమన్స్

* అమ్ముడుపోని షాన్ మార్ష్
* అమ్ముడుపోని ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్
* అమ్ముడుపోని ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్
* సౌరభ్ తివారీ: ముంబై ఇండియన్స్ - రూ. 3.8 కోట్లు
* ఎవిన్ లూయిస్: ముంబై ఇండియన్స్ - రూ. 3.8 కోట్లు
* మురుగన్ అశ్విన్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 2.2 కోట్లు

* అమ్ముడుపోని శివిల్ కౌశిక్
* అమ్ముడుపోని ఇక్బాల్ అబ్దుల్లా
* గౌతమ్ క్రిష్ణప్ప: రాజస్థాన్ రాయల్స్ - రూ. 6.2 కోట్లు
* అమ్ముడుపోని జే సుచిత్
* అమ్ముడుపోని తేజాస్ బరోకా
* అమ్ముడుపోని సాయి కిశోర్ రవిశ్రీనివాసన్
* షెహబాజ్ నదీమ్: ఢిల్లీ డేర్ డెవిల్స్ - రూ. 3.2 కోట్లు
* అమ్ముడుపోని కేసీ కరియప్ప
* రాహుల్ చాహర్: ముంబై ఇండియన్స్ - రూ. 1.9 కోట్లు

ప్రాంఛైజీల వద్ద మిగిలిఉన్న నగదు:


CSK: Rs 17 cr


DD: Rs 12.30 cr


Kings XI: Rs 21.90 cr (RTM: 1)


KKR: Rs 7.60 cr


MI: Rs 15.80 cr


RR: Rs 23.50 cr (RTM: 2)


RCB: Rs 15.85 cr (RTM: 1)


SRH: Rs 7.95 cr

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 16:54 [IST]
Other articles published on Jan 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+