
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన తొలిరోజు వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ టాప్ లేపాడు. గతేడాది కంటే ధర తగ్గినా తొలి రోజు జరిగిన వేలంలో స్టోక్స్ అత్యధిక మొత్తం దక్కించుకున్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన రాజస్థాన్ రాయల్స్ బెన్‌ను 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.
అతడి కోసం పంజాబ్, చెన్నై జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. ఎప్పుడూ తక్కువ ధరలతో ఆటగాళ్లను కొనేందుకు ఆసక్తి ప్రదర్శించే రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్‌కు మాత్రం పెద్దమొత్తంలో చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆటగాళ్లందరూ ఈసారి వేలానికి అందుబాటులోకి వచ్చారు.
శనివారం జరిగిన తొలిరోజు వేలంలో ఆటగాళ్లు కొందరు అటూ, ఇటూ మారారు. టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 9 కోట్లు ఖర్చు చేసింది. తొలిరోజు వేలంలో బెంగళూరు రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించనేలేదు.
తొలిరోజు వేలం విశేషాలు:
* తొలి రోజు వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 14 మంది ఆటగాళ్లను ఎంచుకుంది. అందులో ఇద్దరిని రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా తీసుకుంది.
* ముంబై కేవలం ఆరుగురిని మాత్రమే కొనుగోలు చేసింది. అందులో రెండు రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించింది.
* చెన్నై జట్టూ శనివారం ఎనిమిది మంది ఎంచుకోగా.. అందరూ 30 ఏళ్లు పైబడిన వాళ్లే కావడం గమనార్హం.
* వేలంలో అందుబాటులో ఉన్న 16 రైట్ టు మ్యాచ్ కార్డులను అన్ని జట్లూ తొలిరోజే ఉపయోగించాయి.
* తొలి రోజు 109 మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు. 78 మంది అమ్ముడయ్యారు.
ఏ జట్టులో ఎవరు (రూ. కోట్లలో):
చెన్నై సూపర్ కింగ్స్:
* జాదవ్ (రూ. 7.8 కోట్లు),
* డ్వేన్ బ్రావో (6.4),
* కర్ణ్ శర్మ (5.0),
* వాట్సన్ (4.0),
* రాయుడు (2.2),
* హర్భజన్ (2.0),
* డుప్లెసిస్ (1.6),
* తాహిర్ (1.0)
ఢిల్లీ డేర్ డెవిల్స్:
* మాక్స్‌వెల్ (రూ. 9.0 కోట్లు),
* రబాడ (4.2),
* అమిత్ మిశ్రా (4.0),
* విజయ్ శంకర్ (3.2),
* రాహుల్ తెవాటియా (3.0),
* షమి (3.0),
* గంభీర్ (2.8),
* కొలిన్ మన్రో (1.9),
* జాసన్ రాయ్ (1.5),
* పృథ్వీషా (1.2),
* ఆవేశ్ ఖాన్ (0.7),
* హర్షల్ పటేల్ (0.20)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
* కేఎల్ రాహుల్ (రూ. 11.0 కోట్లు),
* అశ్విన్ (7.6),
* ఆరోన్ ఫించ్ (6.2),
* మార్కస్ స్టాయినిస్ (6.2),
* కరుణ్ నాయర్ (5.6),
* అంకిత్ సింగ్ (3.0),
* డేవిడ్ మిల్లర్ (3.0),
* యువరాజ్ సింగ్ (2.0),
* మయాంక్ అగర్వాల్ (1.0)
కోల్‌కతా నైట్ రైడర్స్:
* క్రిస్ లిన్ (రూ.9.6 కోట్లు),
* మిచెల్ స్టార్క్ (9.4),
* దినేశ్ కార్తీక్ (7.4),
* రాబిన్ ఉతప్ప (6.4),
* కుల్దీప్ యాదవ్ (5.8),
* పియూష్ చావ్లా (4.2),
* నితీశ్ రానా (3.4),
* కమలేష్ నాగర్ కోటి (3.2),
* శుభమాన్ గిల్ (1.8),
* ఇషాంక్ జగ్గి (0.20)
ముంబై ఇండియన్స్:
* కృనాల్ పాండ్య (రూ.8.8 కోట్లు),
* ఇషాన్ కిషన్ (6.2),
* పొలార్డ్ (5.4),
* ప్యాట్ కమిన్స్ (5.4),
* సూర్యకుమార్ యాదవ్ (3.2),
* ముస్తాఫిజుర్ రెహ్మాన్ (2.2)
రాజస్థాన్ రాయల్స్:
* బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు),
* సంజు శాంసన్ (8.0),
* జోఫ్రా ఆర్చర్ (7.2),
* జోస్ బట్లర్ (4.4),
* రహానె (4.0),
* డార్సి షార్ట్ (4.0),
* రాహుల్ త్రిపాఠి (3.4),
* స్టువార్ట్ బిన్ని (0.50)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
* క్రిస్ వోక్స్ (రూ. 7.4 కోట్లు),
* చాహల్ (6.0),
* ఉమేశ్ యాదవ్ (4.2),
* బ్రెండన్ మెక్‌కలమ్ (3.6),
* నవదీప్ సైని (3.0),
* క్వింటన్ డికాక్ (2.8),
* కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (2.2),
* మొయిన్ అలీ (1.7),
* మనన్ వోహ్రా (1.1),
* కుల్వంత్ కేజ్రోలియా (0.85),
* అనికేత్ చౌదరి (0.30)
సన్ రైజర్స్ హైదరాబాద్:
* మనీష్ పాండే (రూ. 11.0 కోట్లు),
* రషీద్ ఖాన్ (9.0),
* శిఖర్ ధావన్ (5.2),
* వృద్ధిమాన్ సాహా (5.0),
* సిద్ధార్థ్ కౌల్ (3.8),
* దీపక్ హుడా (3.6),
* సయ్యద్ ఖలీల్ అహ్మద్ (3.0),
* కేన్ విలియమ్సన్ (3.0),
* కార్లోస్ బ్రాత్‌వైట్ (2.0),
* షకిబ్ అల్ హసన్ (2.0),
* యూసుఫ్ పఠాన్ (1.9),
* బాసిల్ థంపి (0.95),
* నటరాజన్ (0.40),
* రికీ భుయీ (0.20)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.