Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం: అనామకులకు అత్యధిక ధరలు, సీనియర్ల రేటు తగ్గించాలంటూ బేరాలు

IPL Auction 2018: Complete list of players available in the pool with base price

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా రెండో రోజు వేలంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలి రోజు వేలంలో పలువురు అనామక క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోగా, రెండో రోజు వేలంలో సైతం అదే పరంపర కొనసాగుతోంది.

ఐపీఎల్ పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

మొత్తం 578 మంది క్రికెటర్లలో తొలిరోజు 110 మందిని వేలం వేయగా 78 మంది అమ్ముడుపోయారు. ఇందులో 49 మంది భారత క్రికెటర్లున్నారు. రెండో రోజు వేలం రాహుల్‌ చాహర్‌తో ప్రారంభమైంది.

రాజస్థాన్‌కు చెందిన ఈ స్పిన్‌ మాంత్రికుడిని ముంబై ఇండియన్స్‌ రూ.1.90 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అతడి ప్రారంభ ధర రూ.20లక్షలు కాగా అధిక ధరకు అమ్ముడుపోయాడు.

గతేడాది వేలంలో రాహుల్‌ రూ.10లక్షలు పలికాడు. ఇక భారత స్పిన్నర్‌ కేసీ కరియప్పను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. గతేడాది కరియప్ప కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు.

షబాజ్‌ నదీమ్‌ సైతం ఎక్కువ ధర పలికాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ.3.2కోట్ల వెచ్చింది అతడిని సొంతం చేసుకుంది. గతేడాది కూడా నదీమ్‌ను డేర్‌డెవిల్స్‌ కొనుగోలు చేసింది. అద్భుత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అతడిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపింది. సాయికిషోర్‌ రవి శ్రీనివాసన్‌, తేజన్‌ బరోకా, జే.సుచిత్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు.

వేలంలో కర్ణాటక ఆఫ్‌ స్పిన్నర్‌ గౌతమ్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. గౌతమ్‌ను రూ. 6.2 కోట్లు భారీ ధర పెట్టి రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. గౌతమ్‌ కనీస ధర రూ. 20 లక్షలు కాగా, అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్‌ రాయల్స్‌ గౌతమ్‌ను అత్యధిక మొత్తానికి కొనుగోలు చేసింది. గతంలో ముంబై ఇండియన్స్‌కు గౌతమ్‌ ప్రాతినిథ్య వహించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంచితే, రెండో రోజు వేలంలో వెస్టిండీస్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఇవెన్‌ లూయిస్‌ రూ. 3.8 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. మరొకవైపు స్సిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ రూ. 1.9 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. మరొక స్సిన్నర్‌ మురుగన్‌ అశ్విన్‌కు రూ. 2.2 కోట్లు చెల్లించి ఆర్‌సీబీ దక్కించుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 11:39 [IST]
Other articles published on Jan 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+