Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: వికెట్ పడినా.. క్యాచ్ అందుకున్నా.. చిందేయాల్సిందే

IPL Auction 2018, All-Round Stars: Dwayne Bravo, The Deadly Dancer

హైదరాబాద్: వెస్టిండీస్ క్రికెటర్ డేన్ బ్రావో మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంగా కనబడుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని విజయోత్సాహం విభిన్నమైంది. 2008 నుంచి ఐపీఎల్‌లో భాగమైన బ్రావో మ్యాచ్‌లో క్యాచ్ పట్టినా, ఏదైనా వికెట్ తీసినా విభిన్నంగా వ్యక్తపరుస్తాడు.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ పలు జట్లతో కలిసి ఆడిన బ్రావో టీ 20లీగ్‌లలో మంచి రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లీగ్‌లలో 106 మ్యాచ్‌లు ఆడి వంద వరకు వికెట్లు తీశాడు. 34 ఏళ్ల బ్రావో గేమ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా బౌలింగ్ వేసి జట్టుకు న్యాయం చేయగలడు.

ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌లకు బ్యాటింగ్‌ చేసిన బ్రావో 1238పరుగులను తీశాడు. అతని స్ట్రైక్ రేట్ 125.94 పరుగులుగా ఉంది. కాగా అతని అత్యధిక స్కోరు కేవలం 70 మాత్రమే.

ఇంకొద్ది రోజుల్లో ఐపీఎల్ వేలం జరగనున్న తరుణంలో అతనిని ఎవరు తీసుకుంటారా అని క్రికెట్ అభిమానులకు ఉత్కంఠగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రైటు టు కార్డ్ ద్వారా బ్రావో ఎంపికైతే మాత్రం ఏం ఆశ్యర్యపోనక్కర్లేదు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 17:26 [IST]
Other articles published on Jan 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+