Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2017 వేలం విశేషాలు: ఎవరు ఎవరికి ఎంత

హైదరాబాద్: బెంగళూరులో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ముగిసింది. ఐపీఎల్ టీ20 ఫార్మెట్ కావడంతో టీ20లో స్పెషలిస్ట్‌లుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంగా మంచి ధర పలికారు. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు.

బెన్ స్టోక్స్‌ను రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ రూ. 14.5కోట్లకు దక్కించుకుంది. పదేళ్ల ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా స్టోక్స్‌ నిలిచాడు. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో యువరాజ్‌ సింగ్‌ తర్వాత భారీ మొత్తంలో అమ్ముడైన ఆటగాడిగా బెన్‌ స్టోక్స్ నిలిచాడు.

 IPL Auction 2017, Highlights, Bengaluru: Stokes Becomes Most Expensive Player Ever

2015 ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ యువీని భారీగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అతడి తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన తైమాల్ మిల్స్‌ను రూ. 12 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది.

మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా సోమవారం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి 66 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 27 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 10వ ఎడిషన్ వేలం విశేషాలను ఒక్కసారి గమనిస్తే...

వేలంలో అమ్ముడుపోయిన భారత క్రికెటర్ల సంఖ్య: 39
వేలంలో అమ్ముడుపోయిన విదేశీ క్రికెటర్ల సంఖ్య: 27
వేలంలో గరిష్ఠంగా 11మంది ఆటగాళ్లను గుజరాత్ లయన్స్ జట్టు కొనుగోలు చేసింది
వేలంలో కనిష్ఠంగా 5 మంది ఆటగాళ్లను బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది
ఓ ఫ్రాంచైజీ (పుణె) ఆటగాళ్ల కోసం గరిష్ఠంగా వెచ్చించిన మొత్తం: 17.20 కోట్లు
ఓ ఫ్రాంచైజీ (గుజరాత్) ఆటగాళ్ల కోసం కనిష్ఠంగా వెచ్చించిన మొత్తం: 3.85 కోట్లు
వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన మొత్తం: 91.15 కోట్లు

ఎవరు ఎవరికి ఎంత:
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ (ఆటగాళ్లు 8 మంది, ఖర్చు చేసింది రూ. 8.65 కోట్లు)

ఢిల్లీ డేర్ డెవిల్స్ (9 మంది ఆటగాళ్లు, ఖర్చు చేసింది: రూ. 14.05 కోట్లు)

గుజరాత్ లయన్స్ (11 మంది ఆటగాళ్లు, ఖర్చు చేసింది: రూ. 3.85 కోట్లు)

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (8 మంది ఆటగాళ్లు, ఖర్చు చేసింది: రూ. 9.45 కోట్లు)

కోల్ కతా నైట్ రైడర్స్ (9 మంది ఆటగాళ్లు, ఖర్చు చేసింది: రూ. 14.35 కోట్లు)

ముంబై ఇండియన్స్ (7 మంది ఆటగాళ్లు, ఖర్చు చేసింది: రూ. 8.20 కోట్లు)

రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ (9 మంది ఆటగాళ్లు, ఖర్చు చేసింది: రూ. 17.20 కోట్లు)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+