ఐపీఎల్ పుణ్యమా! అని 15 ఏళ్లకే కోటీశ్వరుడైన ప్రయాస్ రే బర్మన్


హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం ముగిసింది. ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు.
70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో 15 ఏళ్ల ప్రయాస్ రే బర్మన్‌ను బెంగళూరు రూ. 1.50 కోట్లకు దక్కించుకుంది.

పిన్న వయసులో కోటీశ్వరుడైన బర్మన్
దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయసులో కోటీశ్వరుడైన ఆటగాడిగా ప్రయాస్ రే బర్మన్ నిలిచాడు. బెంగాల్‌కు చెందిన ప్రయాస్ రే బర్మన్ ఆల్ రౌండర్ కావడం విశేషం. లెగ్ స్పిన్‌తో పాటు బ్యాట్ కూడా సత్తా చాటగలడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన బర్మన్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపడం వేలంలో అతడికి కలిసొచ్చింది.

వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచింది వరుణ్
ఇక, ఐపీఎల్ 2019 వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచింది వరుణ్ చక్రవర్తే. తమిళనాడుకు చెందిన ఈ స్పిన్నర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏకంగా రూ.8.4 కోట్లకు సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ గత సీజన్‌లో రూ.11.5 కోట్లకు కొని, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో విడుదల చేసింది.

‘రైట్ టు మ్యాచ్’ కింద రూ.8.4 కోట్లకు
అయితే, అదే జయదేవ్ ఉనాద్కత్‌ను మళ్లీ ‘రైట్ టు మ్యాచ్' కింద రూ.8.4 కోట్లకు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక, దేశవాళీ ఆటగాళ్లు శివమ్ దూబేను రూ.5 కోట్లకు బెంగళూరు, సిమ్రన్ సింగ్‌ను రూ.4.8 కోట్లకు పంజాబ్ జట్లు సొంతం చేసుకున్నాయి.

ఫ్రాంచైజీలన్నీ పేస్ బౌలర్లపై ఎక్కువగా దృష్టి
ఈసారి వేలంలో అనూహ్యంగా ఫ్రాంచైజీలన్నీ పేస్ బౌలర్లపై ఎక్కువగా దృష్టి సారించాయి. షమీ కోసం పంజాబ్ రూ. 4.6 కోట్లు ఖర్చు చేయగా, లసిత్ మలింగను ముంబై రూ. 2 కోట్లకు దక్కించుకుంది. పేసర్ మోహిత్ శర్మ కోసం చెన్నై రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది. గతేడాది అమ్ముడుపోని ఇషాంత్ శర్మను ఈసారి రూ. 1.10 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications