Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఫ్రాంచైజీలు ఎవరిపై కన్నేశాయి?.. వారంలోగా చెప్పాలని గడువు

IPL asks franchises to submit player shortlist by December 9

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ 2023 సీజన్ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మినీ వేలం నిర్వహించేందుకు ఐపీఎల్ యాజమన్యా నిర్ణయించింది. ఈ నెల 23న కేరళలోని కోచి వేదికగా ఈ వేలం జరగనుంది. దీనిలో మొత్తం పది ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు పాల్గొంటాయి. ఈ వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

అత్యధిక ఆటగాళ్లు ఆ దేశాల నుంచే..

అత్యధిక ఆటగాళ్లు ఆ దేశాల నుంచే..

ఈ ఆటగాళ్లలో అత్యధికులు భారత్ నుంచే ఉండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా (57), సౌతాఫ్రికా (52), వెస్టిండీస్ (33), ఇంగ్లండ్ (31) నుంచి అత్యధిక ఆటగాళ్లు ఈ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఫామ్ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయిన అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్ వంటి వాళ్లు కూడా ఈ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లందరిలో ఎంత మంది వేలంలో కొనుగోలు అవుతారనేది ఆసక్తిగా మారింది. బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, కామెరూన్ గ్రీన్ వంటి వారి కోసం గట్టి పోటీ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.

రిటైన్‌లు.. రిలీజులు..

రిటైన్‌లు.. రిలీజులు..

నవంబర్ నెలలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయి? ఎవరిని రిలీజ్ చేస్తున్నాయి? అనే వివరాలు సమర్పించాలని ఐపీఎల్ యాజమాన్యం కోరింది. ఈ క్రమంలోనే ఆ జట్లన్నీ కలిసి 85 మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. ఇప్పుడు మినీ వేలంలో తాము కొనుగోలు చేసే ఆటగాళ్లతో తమ తమ జట్లలోని లోటుపాట్లను పూడ్చుకోవాలని ఫ్రాంచైజీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు బడా ప్లేయర్లపై అందరి చూపూ ఉంది.

షార్ట్ లిస్టు గడువు..

షార్ట్ లిస్టు గడువు..

ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లపై కన్నేశాయి? ఎవరిపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపని ఆటగాళ్లు వేలంలో ఏం చేస్తారు? అందుకే ఈ ఫ్రాంచైజీలు షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాను తమకు అందించాలని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. ఈ జాబితాలను అన్ని ఫ్రాంచైజీలు ఈ నెల 9వ తేదీలోగా తమకు అందజేయాలని స్పష్టం చేసింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో రాణించిన ఆటగాళ్లకు ఈ వేలంలో భారీ డిమాండ్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి..

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి..

ఈసారి మినీ వేలంలో బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్, కామెరూన్ గ్రీన్ వంటి విదేశీ స్టార్లు కనీస ధర రూ.2 కోట్ల కేటగిరీలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కేటగిరీలో మొత్తం 21 మంది ఆటగాళ్లు ఉండగా.. వీళ్లంతా విదేశీ ప్లేయర్లే కావడం గమనార్హం. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఇలా అత్యధిక కనీస ధర కేటగిరీలో భారత ఆటగాళ్లు లేకపోవడం ఇదే తొలిసారి. భారత వెటరన్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్ తదితరులు రూ.కోటి కేటగిరీలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సౌరాష్ట్ర జట్టు సారధి జయదేవ్ ఉనద్కత్, వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే తమ పేర్లను రూ.50 లక్షల కేటగిరీలో చేర్చడం గమనార్హం.

Story first published: Sunday, December 4, 2022, 8:16 [IST]
Other articles published on Dec 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+