For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Anthems: ఆటతోనే కాదు పాటతోనూ కిక్కే!

ఐపీఎల్ అంటే భారీ సిక్సర్లు, ఎగిరిపడే వికెట్లు, అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలు అందరికీ గుర్తొస్తాయి. దాంతో పాటు ఐపీఎల్ సాంగ్స్‌కు అభిమానులకు కిక్‌ను ఎక్కిస్తాయి. 2008 నుంచి ఆటతో పాటు పాట, యాడ్స్ ఐపీఎల్‌కు మంచి క్రేజ్‌ను అందించాయి. అయితే ఐపీఎల్ ఫస్ట్ సాంగ్‌కు లేటెస్ట్ ఏంథెమ్‌కు చాలా డిఫ్రెన్స్ ఉంది.

2008లో 'తు లగా జోర్' అంటూ వచ్చిన సాంగ్ అభిమానుల్లో ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. సచిన్, ధోనీ, యువరాజ్ సింగ్, షోయబ్ అక్తర్, సైమండ్స్ వంటి ఆటగాళ్లతో సాంగ్‌‌ను తీర్చిదిద్దారు. అయితే ఈ సాంగ్‌లో ఐపీఎల్ జెర్సీలతో ఆటగాళ్లు కనిపించలేదు. 2007 టీ20ప్రపంచకప్‌లోని బెస్ట్ మూమెంట్స్, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో దిగ్గజాల స్టిల్స్‌తో సాంగ్‌ను సెట్ చేశారు.

IPL Anthems Fans get Kick not only with the game but also with the IPL songs

2009లో సాంగ్‌కు బదులుగా సరికొత్త యాడ్‌తో లీగ్‌ ప్రజల్లోకి మరింత చేరువయ్యింది. భిన్నత్వంలో ఏకత్వంపై వీడియోను రిలీజ్ చేశారు. ఓ హిందూ మహిళ సైమండ్స్‌కు పూజలు చేయడం, సిక్కులు సంగక్కర బాగా ఆడాలని ప్రార్థించడం, అలాగే సెహ్వాగ్ కోసం ముస్లింలు, ధోనీకి క్రైస్తవులు ప్రార్థన చేస్తూ యాడ్‌ను రూపొందించారు.

2010 ఐపీఎల్ ఏంథెమ్‌.. భారత్‌కు తిరిగొచ్చామంటూ రూపొందించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 2009 సీజన్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించారు. కానీ 2010లో తిరిగి ఇండియాలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సాంగ్‌ను తీర్చిదిద్దారు. 'సారే జహాసె అచ్చా హిందుస్థాన్ హమారా' అంటూ ఆకట్టుకునేలా రిలీజ్ చేశారు.

దమ్ లగా కె మారా రె? అంటూ 2011 ఐపీఎల్ సాంగ్ వచ్చింది. ఈ వీడియోలో గౌరవ్ కపూర్, సమీర్ కొచ్చా, నవ్‌జోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. వాళ్ల తమ చమత్కార కామెంటరీతో ఐపీఎల్‌కు కొత్తరుచిని అందించారు.

IPL Anthems Fans get Kick not only with the game but also with the IPL songs

2012 సీజన్‌ ఐపీఎల్ ఏంథెమ్‌ను 'ఐసా మౌకా ఔర్ కహ మిలేగా' అంటూ రిలీజ్ చేశారు. అ వీడియోలో గ్లామర్ డోస్‌ను పెంచారు. వ్యాఖ్యాతలు హర్షా భోగ్లే, అజయ్ జడేజా కూడా వీడియోలో కనిపించారు. ఇక 2013 ఎడిషన్‌కు రూపొందించిన జంపింగ్ జంపాంగ్ ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచింది. ఫరా ఖాన్ కొరియోగ్రఫీతో వచ్చిన ఈ వీడియో ప్రజల్లో మంచి ఆదరణ దక్కింది.

2012 సీజన్‌ మాదిరిగానే 2014 సీజన్ సాంగ్‌ను గ్లామరస్‌గా రూపొందించారు. గౌరవ్ కపూర్, అర్చన విజయం, దంద్కేర్‌తో పాటు నవజోత్ సింగ్, రవీంద్ర జడేజాలో అలరించారు. 'బులావా అయా హై' అంటూ ఈ సాంగ్ వచ్చింది.

2015లో ఇండియా ఫెస్టివల్ అంటూ రూపొందిచన ఏంథెమ్‌లోలో పాకిస్థాన్ దిగ్గజ ప్లేయర్ షోయబ్ అక్తర్ కూడా భాగస్వామ్యమయ్యాడు.2016 ఏంథెమ్‌లో 'ఏక్ ఇండియా హ్యాపీ వాలా' అనే సందేశాన్ని ఇస్తూ రిలీజ్ చేశారు. గొడవలు వద్దు.. మనమంతా ఒక్కటే అంటూ సందేశాత్మకంగా రూపొందించారు.

2017 ఏంథెమ్‌ 'వా రె వా' అంటూ వచ్చిన సాంగ్ ఆకట్టుకుంది. ఐపీఎల్ బెస్ట్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్ సంబరాలను మిక్స్ చేస్తూ రూపొందించారు.

2018లో బెస్టె వర్సెస్ బెస్ట్ అంటూ, 2019లో గేమ్ బనేయేగా నేమ్ అంటూ ఏంథెమ్స్‌లో రిలీజ్ చేశారు. 2019 ఏంథెమ్‌లోలో ధోనీ, రోహిత్, కోహ్లి కలిసి నటించారు. 2020లో కేల్ బోలేగా అంటూ రూపొందించారు.

2021లో 'ఇండియా కా అప్నే మంత్రా' అంటూ క్రియేటివ్‌గా ఏంథెమ్‌ను రూపొందించారు. 2022 థీమ్‌లో ధోనీ మెయిన్ లీడ్‌లో 'ఏ అబ్ నార్మల్ హై' అంటూ వచ్చిన ఏంథెమ్ ఆకట్టుకుంది. గత సీజన్ ఏంథెమ్‌లో 'షోర్ మచా' అంటూ రిలీజ్ చేసిన సాంగ్‌లో స్టార్లు అందరూ అలరించారు. ఇక ప్రస్తుత సీజన్ సాంగ్ 'గజబ్ ఐపీఎల్ కే అజబ్ రాంగ్' అంటూ అందర్నీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Story first published: Monday, March 18, 2024, 8:34 [IST]
Other articles published on Mar 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+