
కైఫ్ మాత్రం రిసెప్షన్ వద్దకు వెళ్లి
అది గమనించిన వార్న్ సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించడంతో.. 'కైఫ్ మాత్రం రిసెప్షన్ వద్దకు వెళ్లి నా పేరు కైఫ్ అని చెప్పాడు. రిసెప్షనిస్ట్ తనకు తెలుసన్న చెప్పిన తర్వాత మరోసారి నా పేరు కైఫ్ అని గుర్తు చేశాడు. నేను వెళ్లి అడిగినా అవును, నా పేరు కైఫ్ అని మూడోసారి అదే మాట అన్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇబ్బందేమిటో చెప్పమని అడిగినా మళ్లీ కైఫ్ అనే చెప్పాడు. దాంతో అతని ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది.'

ఎక్కువ మందితో కలవాల్సి ఉంటుంది
అతను టీమిండియా తరపున ఆడానని తనకు నాకిచ్చినట్లుగానే పెద్ద గది ఎందుకివ్వలేదని అడుగుతున్నట్లు గ్రహించాను. పరోక్షంగా దాని గురించే పట్టుబడుతుండటంతో.. 'ఎక్కువగా ఆలోచించవద్దని, అందరు ఆటగాళ్లకు ఒకే తరహా గది ఇచ్చారని, ఎక్కువ మందితో కలవాల్సి ఉంటుంది కాబట్టి మాత్రమే పెద్ద గది ఇచ్చారని చెప్పడంతో అతను వెళ్లిపోయాడు. ఆ సంఘటనతో భారత సీనియర్ ఆటగాళ్లపై ఒక అభిప్రాయం ఏర్పడింది.' అని వార్న్ నాటి ఘటన గురించి వార్న్ వివరించాడు.

అసలు వయసా లేక ఐపీఎల్ వయసా
జట్టులో మరో సహచరుడు మునాఫ్ పటేల్‌ను ఒకానొక సందర్భంలో వయసు గురించి అడిగితే ‘అసలు వయసా లేక ఐపీఎల్ వయసా' అని అతను తిరిగి ప్రశ్నించాడు. మళ్లీ తానే ఐపీఎల్ ప్రకారమైతే తనకు 24 ఏళ్లని, అసలు వయసు 34 అయినా ఐపీఎల్‌లో అవకాశాలు దక్కించుకునేందుకు 24 ఏళ్లేనని చెబుతానంటూ తనలోని హాస్య చతురతను బయట పెట్టాడు.

జడేజా సమయపాలన గురించి చాలా
ఇక జడేజా సమయపాలన గురించి చాలా కష్టపడ్డాడట. ఎప్పుడూ సమయానికి ప్రాక్టీసుకు హాజరయ్యేవాడు కాదట. ఇలా ప్రతీసారి ఆలస్యంగా రావడం చికాకు అనిపించింది. ఒకసారి హోటల్‌కు తిరిగి వెళుతుండగా మధ్యలో బస్సు నుంచి దించేసి నడుస్తూ రమ్మని శిక్ష విధించడంతో అతనిలో కొద్దిపాటి మార్పును గమనించానని తెలిపాడు.


Click it and Unblock the Notifications













