

టీ20 ఫార్మాట్లో డెత్ ఓవర్లు చాలా కీలకం. డెత్ ఓవర్లలో ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే బ్యాటింగ్ జట్టుకు అంతా మంచింది. అలాగే పరుగులు రాకుండా ఎంత కట్టడి చేస్తే బౌలింగ్ టీంకు అంత మంచింది. దీంతో డెత్ ఓవర్లలో భారీగా పరుగులు చేయాలని బ్యాటర్లు, పరుగులు రాకుండా కట్టడి చేయాలని బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తుంటారు. దీంతో టీ20 క్రికెట్లో డెత్ ఓవర్లలో ఆట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డెత్ ఓవర్లలో పలువురు బ్యాటర్లు విజృంభించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తే.. పలువురు బౌలర్లు అద్భుతంగా కట్టడి చేసి వికెట్లు తీస్తుంటారు. ఈ క్రమంలో డెత్ ఓవర్లలో రాణించిన ఆటగాళ్లు హిరోలు అయిపోతుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్ కల్గి ఉన్న బ్యాటర్లు ఎవరో ఓ సారి పరిశీలిద్దాం.

2019 నుంచి ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో కనీసం 100 బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. డెత్ ఓవర్లలో డివిల్లియర్స్ ఏకంగా 232 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత రెండో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రసెల్ ఉన్నాడు. రసెల్ డెత్ ఓవర్లలో 223 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 215 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన షిమ్రోన్ హెట్‌మేయర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 206 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా నాల్గో స్థానంలో, 202 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన కీరన్ పొలార్డ్ ఐదో స్థానంలో ఉన్నారు.