భార్యతోనా... మరొకరితోనా, చెప్పండి: రైనా గడుసు
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా భారత ట్వంటీ20 కెప్టెన్ ఎంఎస్ ధోనీనే ఈ విషయంలో అనుసరిస్తున్నాడు. తదుపరి భారత కోచ్ విషయంపై తనకు ఎదురైన ప్రశ్నకు రైనా ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం బీసీసీఐ టీమ్‌ఇండియాకు కోచ్‌ను అన్వేషించే పనిలో పడిన విషయం తెలిసిందే. ముంబైలో శుక్రవారం ఏర్పాటైన మీడియా సమావేశంలో భారత కోచ్ అయితే సౌకర్యంగా ఉంటుందా, విదేశీ కోచ్ అయితేనా అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దానికి రైనా షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చాడు.

'సార్ మీరే చెప్పండి. మీరు సొంత భార్యతో సాకర్యంగా ఉంటారా, మరొకరితోనా?' అని రైనా అన్నాడు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు. అంతిమంగా కోచ్‌ను నియమించే బాధ్యత బోర్డుదేనని బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషమేనని రైనా చెప్పాడు.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు ధోనీ కూడా ఓ మీడియా ప్రతినిధితో అంతే దూకుడుగా సమాధానం ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications