న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బుధవారం నాడు ఐపీఎల్ జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ సారథి ఎంఎస్ ధోనీ పైన మండిపడ్డాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌కు ప్రాధాన్యతం ఇవ్వడం లేదని విమర్శించాడు. ఇందుకు సంబంధించి గవాస్కర్ ఓ ఆర్టికల్ రాశాడు.
గవాస్కర్ ధోనీ కెప్టెన్సీ స్కిల్స్‌ను, బ్యాటింగును ఇష్టపడుతుంటాడు. అయితే, ధోనీ తన ఐపీఎల్ 9వ ఎడిషన్లో మాత్రం విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. పుణే జట్టు ఈ టోర్నీలో అందర్నీ అసంతృప్తికి గురి చేస్తోంది.
కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, ఫఫ్ డుప్లెసిస్‌లు వరుసగా గాయపడ్డారు. ఇది కూడా పుణేకు ఇబ్బందులు తెచ్చి పెట్టిందని చెప్పాడు. కీలక ఆటగాళ్లు గాయాల పాలు కావడం పుణే జట్టుకు అసలైన సెట్ బ్యాక్ అన్నాడు. ధోనీ కూడా గతంలో వలె ఆడటం లేదని అబిప్రాయపడ్డాడు.

కీలకమైన సమయంలో ధోనీ బ్యాటింగ్‌లో మారేందుకు ఇష్టపడినట్లుగా కనిపించడం లేదని, వీటి వల్ల కూడా గెలవాల్సిన మ్యాచును కూడా ఓడిపోతుందన్నాడు. 13 మ్యాచుల్లో పుణే గెలిచింది తొమ్మిది మాత్రమేనని, వాటికి ధోనీ బాధ్యత వహించాలన్నాడు. ఇది ధోనీకి వరస్ట్ సీజన్ అన్నాడు.
ద్రవిడే తగిన వ్యక్తి: రవిశాస్త్రి
మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ను టీంఇండియా కోచ్‌గా నియమించాలనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది. భారత కోచ్ పదవికి ద్రవిడ్ సరైనవాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డ మరుసటి రోజే, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్రతి ఆటగాడికీ రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతికి కొంత సమయం ఇవ్వాలని నేనెప్పుడూ చెబుతుంటానని, ద్రావిడ్‌కు ఆ విరామం దొరికిందని, నిజాయితీగా సలహా ఇస్తున్నానని, బీసీసీఐ మార్పు కోసం చూస్తుంటే కోచ్ పదవికి ద్రావిడ్ కంటే తగిన వ్యక్తి మరొకరు ఉండరని చెప్పాడు.