For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రునాల్ విధ్వంసం: ఢిల్లీ చిత్తు, సచిన్ సందడి(పిక్చర్స్)

విశాఖపట్నం: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలు సజీవమయ్యాయి. ముంబై ఆటగాడు కృనాల్‌ పాండ్య (86; 37 బంతుల్లో 7ఫోర్లు, 6సిక్స్‌లు) విధ్వంసక విన్యాసాలతో చెలరేగడంతో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. కాగా, ముంబైకిది ఏడో విజయం.

'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కృనాల్‌తో పాటు గప్తిల్‌ (48; 42 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (31; 21 బంతుల్లో 1ఫోర్, 3సిక్స్‌లు) మెరవడంతో మొదట ముంబై 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఛేదనలో డిల్లీ ఏమాత్రం విజయం దిశగా అడుగువేయలేదు. 19.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. 40 పరుగులు చేసిన డికాకే టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు.

వికెట్ తీసిన ఆనందం

వికెట్ తీసిన ఆనందం

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలు సజీవమయ్యాయి.

అభిమానుల ఉత్సాహం

అభిమానుల ఉత్సాహం

ముంబై ఆటగాడు కృనాల్‌ పాండ్య (86; 37 బంతుల్లో 7ఫోర్లు, 6సిక్స్‌లు) విధ్వంసక విన్యాసాలతో చెలరేగడంతో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. కాగా, ముంబైకిది ఏడో విజయం.

ఔట్...

ఔట్...

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కృనాల్‌తో పాటు గప్తిల్‌ (48; 42 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (31; 21 బంతుల్లో 1ఫోర్, 3సిక్స్‌లు) మెరవడంతో మొదట ముంబై 4 వికెట్లకు 206 పరుగులు చేసింది.

సచిన్ సందడి

సచిన్ సందడి

ఛేదనలో డిల్లీ ఏమాత్రం విజయం దిశగా అడుగువేయలేదు. 19.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. 40 పరుగులు చేసిన డికాకే టాప్‌ స్కోరర్‌‌గా

నిలిచాడు.

అభిమానుల ఉత్సాహం

అభిమానుల ఉత్సాహం

ఛేదనలో రెండో ఓవర్లోనే ఓపెనర్‌ మయాంక్‌(8) వికెట్‌ను రెండో ఓవర్లోనే కోల్పోయినప్పటికీ వినయ్‌ ఓవర్లో డికాక్‌ వరుసగా 4, 6, 4, 4 బాదడంతో ఢిల్లీ నాలుగు ఓవర్లకు 40/1తో మెరుగ్గానే కనిపించింది.

ముంబై బుల్లి అభిమాని

ముంబై బుల్లి అభిమాని

కానీ, ఐదో ఓవర్లో కరుణ్‌ నాయర్‌ (8)ను హర్భజన్‌ ఔట్‌ చేయడంతో మళ్లీ పతనం మొదలైంది.

సచిన్ సందడి

సచిన్ సందడి

అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఢిల్లీ.. ఓటమి దిశగా వేగంగా సాగింది. 10 ఓవర్లలో 81/4తో నిలిచిన ఆ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు.

గెలిచిన ఆనందం

గెలిచిన ఆనందం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి గప్తిల్‌తో కలిసి రోహిత్‌ చక్కని ఆరంభాన్నిచ్చాడు. అతడు మూడు సిక్సర్లు బాదడంతో 6 ఓవర్లకు ముంబై 45/0తో నిలిచింది.

అభిమానులు

అభిమానులు

తర్వాతి ఓవర్లో రోహిత్‌ను మిశ్రా ఔట్‌ చేసినా ఆ సంతోషం ఢిల్లీకి ఎంతోసేపు నిలువలేదు. కృనాల్‌ పాండ్య వచ్చి.. ఢిల్లీ బౌలర్లను, ముఖ్యంగా స్పిన్నర్లను ఉతికేశాడు.

ఢిల్లీ బ్యాట్స్‌మన్

ఢిల్లీ బ్యాట్స్‌మన్

9వ ఓవర్లో మిశ్రా గూగ్లీని లాంగాన్‌లో స్టాండ్స్‌లో బాదడం ద్వారా విధ్వంసాన్ని మొదలెట్టిన కృనాల్‌.. భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

సచిన్ అభినందన

సచిన్ అభినందన

ఇమ్రాన్‌ తాహిర్‌ వేసిన 13వ ఓవర్లో గప్తిల్‌ వరుసగా రెండు సిక్సర్లు కొట్టగా.. కృనాల్‌ వరుసగా 6, 4 బాదేశాడు. కృనాల్‌ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.

అభిమానులసెల్ఫీ సందడి

అభిమానులసెల్ఫీ సందడి

గప్తిల్‌ను జహీర్‌ ఔట్‌ చేసినా.. కృనాల్‌ జోరు కొనసాగింది. 16వ ఓవర్లో మిశ్రా బౌలింగ్‌లో అతను వరుసగా 4, 6, 6 దంచేశాడు. జహీర్‌ బౌలింగ్‌లోనూ ఓ బంతిని స్టాండ్స్‌లోకి పంపిన అతడు సెంచరీ చేసేలా కనిపించాడు.

బాగా బాదావు

బాగా బాదావు

కానీ, 18వ ఓవర్లో చక్కగా బౌలింగ్‌ చేసిన మోరిస్‌.. కృనాల్‌తోపాటు పొలార్డ్‌ (3)నూ ఔట్‌ చేశాడు.

కెప్టెన్లు జహీర్, రోహిత

కెప్టెన్లు జహీర్, రోహిత

ఆ తర్వాత బట్లర్‌ (18 నాటౌట్‌), రాయుడు (13 నాటౌట్‌) స్కోరును 200 దాటించారు.

ఛీర్ లీడర్స్

ఛీర్ లీడర్స్

మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చినా జహీర్‌ (1/23) మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

అభిమానం బారులు

అభిమానం బారులు

తాహిర్‌ (4-0-59-0) ఈ సీజన్‌లోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలరయ్యాడు. ఓ ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులిచ్చిన స్పిన్నర్‌ కూడా అతడే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+