న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్‌కు కాన్పూర్‌లో హోటల్ గది దొరకలేదు. ఐపీఎల్ 9లో భాగంగా కాన్పూర్ అభిమానులకు ఇది అసంతృప్తిని కలిగించేదే. తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడే మ్యాచులకు షారుక్ హాజరవుతుంటాడు.
తన జట్టును ఉత్సాహపరుస్తూ, ప్రేక్షకులకు కనువిందు చేస్తాడు. కాన్పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - గుజరాత్ లయన్స్ గురువారం నాడు తొలిసారి తలపడనున్నాయి. ఈ మ్యాచు కోసం కాన్పూర్‌లో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్లో షారుక్ ఖాన్‌కు గది దొరకలేదు.

అప్పటికే హోటల్ గదులను బీసీసీఐ బుక్ చేసింది. దీంతో, షారుక్ ఖాన్‌కు గది దొరకలేదు. షారుక్ ఖాన్ తన టీంకు 8 గదులు అడిగారు. సమాచారం మేరకు సదరు హోటల్ మేనేజర్.. గదులు దొరకవని షారుక్ ఖాన్ పర్సనల్ అసిస్టెంట్‌కు తెలియజేశారు.