Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిషేధం: ఐపీఎల్‌లో మే 14న జరిగే మ్యాచ్‌ని షారుఖ్ ఖాన్ ప్రత్యక్షంగా వీక్షించలేడు

ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌పై వరుసగా మూడో ఏడాది వాంఖడె స్డేడియం మ్యాచ్ నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్‌లో భాగంగా 2012లో వాంఖడె స్టేడియంలో చేసిన రచ్చకు గాను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ షారుఖ్ ఖాన్‌ని ఐదేళ్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

దీంతో ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ని చూసే అవకాశాన్ని కోల్పోయాడు. మే 14న కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్‌కి మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని షారుఖ్ ప్రత్యక్షంగా వీక్షించలేడు.

ఈ సందర్భంగా ముంబై క్రికెట్ ఆసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ షారూఖ్ ఖాన్ పై నిషేధం కొనసాగుతున్నందున, వాంఖడే స్టేడియంలోకి అతన్ని అనుమతించబోమని తెలిపారు. గత ఏడాది వాంఖడెలో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మాత్రం షారుఖ్‌కు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

IPL 8: Shah Rukh will not be able to witness KKR's Wankhede game

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఫైనల్ మ్యాచ్‌ను బెంగుళూరుకు బీసీసీఐ మార్చింది. దీంతో ముంబైలో వాంఖడె స్టేడియంలో షారుఖ్ మ్యాచ్‌ని వీక్షించే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే ముంబైలోనే మరో స్టేడియం బ్రాబౌర్నేలో మే 16న కోల్‌కత్తా, రాజస్ధాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ని వీక్షించేందుకు షారుఖ్‌కు అవకాశం ఉంది.

2008లో ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన రాజస్ధాన్ రాయల్స్ ఐపీఎల్ టోర్నమెంట్లో మొదటి నాలుగు మ్యాచ్‌లను అహ్మాదాబాద్‌లోని మెతేరా స్టేడియంలో ఆడింది. ఈ ఏడాది క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా రాజస్ధాన్ రాయల్స్ కోసం ప్రత్యేకించి చివరి మూడు మ్యాచ్‌లను ముంబైలోని బ్రాబౌర్నే స్డేడియంలో ఆడేందుకు అనుమతిచ్చింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+