‘నా కొడుకు కెకెఆర్ అంటూ కేకలు’: బాధనిపించిందన్న షారుఖ్ ఖాన్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 టోర్నీ ఫైనల్‌లో తమ జట్టు లేకపోవడం బాధేసిందని బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సహ యజమాని షారుక్ ఖాన్ తెలిపారు. ఈడెన్‌లో కెకెఆర్ లేకపోవడంతో ఎంతో బాధగా అనిపించిందని షారుక్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
కాగా, టీవీలోనే ఫైనల్ మ్యాచును తన కొడుకు అబ్రమ్‌తో కలిసి చూసినట్లు తెలిపారు. ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆయన అభినందనలు తెలిపారు.
టీవీలో ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపు తన కొడుకు కెకెఆర్.. కెకెఆర్ అంటూ అరుపులు కేకలు పెట్టాడని షారుక్ ఖాన్ చెప్పారు. ఈడెన్ ఫైనల్‌లో కోల్‌కతా బాధనిపించిందని ఆయన మరోసారి చెప్పారు.

ఇది ఇలా ఉండగా 2012, 2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీలను గౌతం గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఐపిఎల్-8 ఫైనల్ మ్యాచులో చెన్నైని చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ట్రోపీని సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications