ఏప్రిల్ 7న సాల్ట్‌లేక్‌లో ఐపీఎల్ ఆరంభ వేడుకలు, బాలీవుడ్ తారల డ్యాన్స్
ముంబై: ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సిద్ధమైంది. భారత్‌లో ఈనెల 8 నుంచి ఐపీఎల్ 8వ సీజన్ ఆరంభం కానుంది. ఈ ఆరంభ వేడుకలకు కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా నిలవనుంది.
ఏప్రిల్ 7న ఐపీఎల్ 8వ సీజన్ ఆరంభ వేడుకలను సాయంత్రం 7.30 నిమిషాలకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు పాల్గొంటున్నారని వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఆరంభ వేడుకలను వీక్షించేందుకు బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్టు తెలిపారు. మినిమం ధర రూ. 200. ఇక బాక్సాఫీసు టికెట్లను కూడా త్వరలోనే అమ్మకాలు జరపనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఏప్రిల్ 8న ప్రారంభంకానున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కత్తా నైట్ రెైడర్స్, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications