
టాప్‌లో స్వప్నిల్ అస్నోద్కర్
ఐపీఎల్ అరంగేంట్ర మ్యాచ్‌లోనే ఎనిమిది మంది భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో అరంగేంట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో స్వప్నిల్ అస్నోద్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన స్వప్నిల్ అస్నోద్కర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో స్థానంలో గౌతం గంభీర్ ఉన్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున బరిలోకి దిగిన గౌతం గంభీర్ అరంగేంట్ర మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌పై 58 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మూడో స్థానంలో పడిక్కల్
ఈ జాబితాలో మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన పడిక్కల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 56 పరుగులు చేశాడు. నాల్గో స్థానంలో తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఉన్నాడు. 2010లో ముంబై ఇండియన్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌పై రాయుడు 55 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో విద్యుత్ శివరామకృష్ణన్ ఉన్నాడు. 2008లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడిన విద్యుత్ శివరామకృష్ణన్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై 54 పరుగులు చేశాడు.

ఆరో స్థానంలో ఆయుష్ బడోని
ఈ జాబితాలో ఆరో స్థానంలో ఆయుష్ బడోని ఉన్నాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌పై ఆయుష్ బడోని 54 పరుగులు చేశాడు. ఇక ఏడో స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌పై ధావన్ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో శ్రీవత్స్ గోస్వామి ఉన్నాడు. 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన శ్రీవత్స్ గోస్వామి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 52 పరుగులు చేశాడు.

గుజరాత్ విజయం
సోమవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 158 పరుగులు చేయగా.. గుజరాత్ ఆ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 3 వికెట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.


Click it and Unblock the Notifications












