అనుష్క ఉందా: కోహ్లీతో గవాస్కర్, ఫ్యాన్స్ ఆగ్రహం, ధోనీ సరదా వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం నాడు మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీని అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి అడిగారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ అయిన కోహ్లీని గవాస్కర్ మ్యాచ్ గురించి అడిగాడు. చివరగా.. 'ఆమె ఇక్కడ ఉందా' అని కోహ్లీని ప్రశ్నించాడు. దానికి కోహ్లీ 'అవును.. ఉంది' అని సమాధానం ఇచ్చాడు. అయితే, మ్యాచ్ సమయంలో అనుష్క శర్మ గురించి అడగటంపై సామాజిక అనుసంధాన వేదికలపై గవాస్కర్ పైన విమర్శలు కురిపిస్తున్నారు. అనుష్క గురించి అడగటం ఏమిటని దుమ్మెత్తి పోస్తున్నారు.

కూతురితోనే ధోనీ
నాలుగు నెలల పాటు ఆస్ట్రేలియాలోనే గడిపిన ధోనీ.. మరికొద్ది రోజులు అక్కడే ఉంటే పౌరసత్వం దొరికేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చాక తన కూతురు జీవాతో ఎక్కువగా గడుపుతున్నాడు. ఓ వైపు ఐపీఎల్ ఆడుతూనే తన కూతురుతో గడుపుతున్నాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications