Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో మోస్ట్ వేస్ట్ ప్లేయర్: యువీకే పట్టం కట్టిన యువత

న్యూఢిల్లీ: 46 రోజుల పాటు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమరం ముగిసింది. ఐపీఎల్‌ 8వ ఎడిషన్‌లో ఎన్నో రికార్డులు నమోదవగా, మరెన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో మోస్ట్ వేస్ట్ ప్లేయర్ ఎవరంటూ నిర్వహించిన పోల్‌లో యువత యువరాజ్ సింగ్‌కే పట్టం కట్టారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో కుర్ర ప్లేయర్లు తమ సత్తా చాటారు. లక్షలు చెల్లించి ప్రాంఛైజీలు కొనుగోలు చేస్తే కోట్ల రూపాయలు చెల్లించిన ఆటగాళ్లు మాదిరి పరుగులు సాధించారు. అత్యంత ఖరీదైన ఆటగాడు ట్యాగ్‌ను సొంతం చేసుకున్న యువరాజ్ కుర్ర ఆటగాళ్ల ముందు తేలిపోయాడు.

పరుగులు చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్‌లో మోస్ట్ వరల్డ్ ప్లేయర్ ఎవరంటూ నిర్వహించిన పోల్‌లో యువీ నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకోగా, అతని తర్వాత స్ధానాన్ని రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దినేశ్ కార్తిక్ కైవసం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఈ సీజన్‌కి బెస్ట్ ప్లేయర్‌గా క్రిస్ గేల్ నిలిచాడు.

ipl 8 edition waste player yuvraj singh

ఐపీఎల్ 8వ ఎడిషన్ వేలం పాటలో యువరాజ్ సింగ్‌ని ఢిల్లీ ప్రాంఛైజీ రూ. 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో యువరాజ్ పరుగుల సునామీ సృష్టిస్తాడని అటు ప్రాంఛైజీ, ఇటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

యువీపై అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ నిరాశయ్యాయి. ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. అభిమానులను ఏమాత్రం అలరించలేకపోయాడు. ఐపీఎల్ 2015లో 13 ఇన్నింగ్స్ (14 మ్యాచ్‌లు) ఆడిన యువరాజ్ సింగ్ 248 పరుగులు చేశాడు. దీంతో యువరాజ్ సింగ్ ఒక్కో పరుగు ఖరీదు రూ. 6.5 లక్షలు (ఖచ్చితంగా రూ. 6,45,161).

తొలి 7 ఇన్నింగ్స్‌లో 124 పరుగులు సాధిస్తే, ఆ తర్వాత 6 ఇన్నింగ్స్‌లో 124 పరుగులు సాధించాడు. తాను ఆడిన 13 ఇన్నింగ్స్‌లో యువీ కేవలం రెండు అర్ధ సెంచరీలను మాత్రమే సాధించాడు. ఇక టోర్నమెంట్లో చివరి మ్యాచ్‌గా ఆదివారం నాడు బెంగుళూరుతో ఆడిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 11 పరుగులు మాత్రమే సాధించాడు. టోర్నమెంట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 11 పాయంట్లతో 7వ స్ధానం(5 గెలుపు, 8 ఓటమి, 1 మ్యాచ్ ఫలితం తేలలేదు)లో నిలిచింది.

మొత్తం - 210 బంతుల్లో 248 పరుగులు
అత్యధిక స్కోరు - 57
ఫోర్లు - 23
సిక్సులు - 10

బౌలింగ్: 9 ఓవర్లు, 72 పరుగులు, 1 వికెట్ (6 ఇన్నింగ్స్)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+