చెన్నై: ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను సామాజిక అనుసంధాన వేదికలో ట్వీట్ చేశారు. అందులో చెన్నై సూపర్ కింగ్స్ పైన పెద్ద బాంబు పేల్చాడు. కనీసం నలుగురు చెన్నై ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో ఉండి ఉంటారని చెప్పాడు.
అందులో జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. తన వరుస ట్వీట్లలో ఆయన బాంబు పేల్చాడు. ఐపీఎల్ గేమ్‌ల పైన పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ జరుగుతున్నాయని చెప్పాడు. ఒక్కో ఆటకు తొమ్మిది వేల కోట్ల నుండి పదివేల కోట్ల వరకు ఉండవచ్చునని చెప్పాడు.

ఈ సందర్భంగా లలిత్ మోడీ... బీసీసీఐ, ఐసీసీ, ఐపీఎల్ అధికారుల పైన మండిపడ్డారు. ప్రతి మ్యాచ్‌కు వేల కోట్ల బెట్టింగ్స్ జరుగుతున్నాయని, మీడియా మేల్కొనాలని సూచించాడు.