IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి సీఎస్కే స్టార్ స్పిన్నర్?
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల బదిలీల వ్యవహారం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్న రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్తుండటం.. బదులుగా కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వస్తున్నాడనే వార్తలతో ట్రేడింగ్ మార్కెట్ ఇప్పటికే వేడెక్కింది. ఈ క్రమంలోనే సీఎస్కే స్టార్ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నూర్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ట్రేడ్ చేయబోతున్నారంటూ ఎక్స్ వేదికగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆసక్తి చూపిస్తోందా?
వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టులోకి ఓ మంచి స్పిన్నర్‌ను తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రదర్శన పట్ల ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం ఎంతో నమ్మకంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2027 టోర్నీ కంటే ముందే ఓ బలమైన స్పిన్ బౌలింగ్ కాంబినేషన్‌ను సిద్ధం చేయడానికి ఎస్ఆర్‌హెచ్ ఇతర జట్ల స్పిన్నర్లపై కూడా కన్నేసిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోని కొందరు ఆటగాళ్లను తీసుకోవడానికి సీఎస్కే కూడా ఆసక్తి చూపిస్తోందని.. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఎక్స్ వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే.

సీఎస్కే తరఫున రాణిస్తున్న నూర్ అహ్మద్
గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన నూర్ అహ్మద్.. ఐపీఎల్ 2025 సీజన్ నుంచి సీఎస్కే జట్టులో భాగమయ్యాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సీఎస్కే రీటైన్ చేసుకున్న కొద్దిమంది ఆటగాళ్లలో నూర్ అహ్మద్ ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో నూర్ అహ్మద్ కాస్త తడబడినప్పటికీ.. మొత్తంగా 14 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అయితే ఈ రెండు సీజన్లలోనూ చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకుంటారనే ప్రచారం కూడా జరిగింది, కానీ ఆయన ఐపీఎల్ 2027లోనూ సీఎస్కే కోచ్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూర్ అహ్మద్ ట్రేడింగ్‌పై వస్తున్న వార్తలు ప్రస్తుతానికి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications