IPL 2027: ఐపీఎల్‌లో 174 వికెట్లు.. ఇప్పుడు కోచ్‌గా ఎంట్రీ!
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ ఫ్రాంచైజీకి అత్యధిక వికెట్లు తీసిన మాజీ భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు అక్టోబర్ 21, బుధవారం నాడు సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అమిత్ మిశ్రా అనుబంధం
43 ఏళ్ల అమిత్ మిశ్రాకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో సుదీర్ఘ అనుబంధం ఉందియ ఆయన 2008 నుంచి 2010 వరకు, 2015 నుంచి 2021 వరకు రెండు విడతల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడారు. ఆ సమయంలో 99 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 23.69 సగటుతో 7.36 ఎకానమీతో 106 వికెట్లు పడగొట్టారు. 2008 తొలి ఐపీఎల్ సీజన్‌లో నమోదు చేసిన 5/17 ఆయన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది. ఇప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మొత్తంగా ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 174 వికెట్లు తీశారు.

బలమైన కోచింగ్ సిబ్బందితో ఢిల్లీ క్యాపిటల్స్
అమిత్ మిశ్రా చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ మరింత బలంగా తయారైంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ, అసిస్టెంట్ అండ్ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమింద వాస్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. స్పిన్ బాధ్యతలను అమిత్ మిశ్రా పంచుకోనున్నారు.
అమిత్ మిశ్రా అంతర్జాతీయ కెరీర్
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అమిత్ మిశ్రా 68 మ్యాచ్‌ల్లో ఆడి మొత్తం 156 వికెట్లు సాధించారు. ఇందులో 22 టెస్టుల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 10 టీ20ల్లో 16 వికెట్లు పడగొట్టారు. వన్డేల్లో రెండు సార్లు, టెస్టుల్లో ఒకసారి ఐదు వికెట్ల ఘనత సాధించారు. అంతేకాకుండా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో ఆయన కూడా ఓ సభ్యుడిగా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


