Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిక్కుల్లో చాహల్.. ప్రైవేట్ మెసేజ్‌లు లీక్ చేసిన నటి!

టీమిండియా లెగ్ స్పిన్నర్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2026లో ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న తానియా ఛటర్జీ.. చాహల్ తనకు ఇన్‌‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్ పంపాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన ఫోన్‌ను మీడియా ప్రతినిధులకు చూపిస్తూ.. చాహల్ తన ఫోటోకు స్పందిస్తూ .."ఆప్ క్యూట్ హో" (మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు) అని మెసేజ్ చేసినట్లు పేర్కొంది.

మెసేజ్ చూసేసరికి ఆలస్యమైందన్న నటి
ఉల్లు, గందీ బాత్ వంటి ఓటీటీ సిరీస్‌ల ద్వారా పాపులర్ అయిన తానియా ఛటర్దీ.. ఈ విషయాన్ని కెమెరాల ముందు బయటపెట్టారు. చాహల్ పంపిన మెసేజ్ ను తాను చాలా ఆలస్యంగా చూశానని.. అందుకే చాహల్‌కు రిప్లై ఇవ్వదని తానియా వివరించారు. ఈ సమయంలో కెమెరామెన్లు ఆమెను ఆటపట్టిస్తుండగా.. తానియా సిగ్గుపడుతూ కనిపించారు. అయితే ఈ ఆరోపణలపై యుజ్వేంద్ర చాహల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

IPL 2026 Yuzvendra Chahal in Trouble Actress Taniya Chatterjee Leaks Private Instagram DMs Details

అభిమానుల ఆగ్రహం.. పబ్లిసిటీ స్టంట్ అని కొందరి వాదన
ఈ వార్త బయటకు రాగానే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు యుజ్వేంద్ర చాహల్ ప్రవర్తనను తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్న చౌకబారు పని అని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ఏఐ కాలంలో ఇలాంటి ఫేక్ చాట్‌లు సృష్టించడం పెద్ద కష్టమేమీ కాదని.. వార్తల్లో నిలవడానికి నటి ఇలాంటి పనులు చేస్తోందని చాహల్ అభిమానులు మండిపడుతున్నారు. గతంలో ధనశ్రీ వర్మతో విడిపోయిన తర్వాత యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

వృత్తిపరంగా బిజీగా ఉన్న యుజ్వేంద్ర చాహల్
వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నప్పటికీ.. మైదానంలో యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు(224) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ జట్టు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. తన తదుపరి మ్యాచ్‌లో భాగంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది.

Story first published: Monday, April 13, 2026, 14:24 [IST]
Other articles published on Apr 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+